కొంతమంది వణుకుడు సమస్యతో బాధపడుతుంటారు మరి ఈ సమస్య ఎలాంటి వారికి వస్తుంది. దీనికి కారణాలు ఏమిటి? దీని యొక్క లక్షణాలను ఈ విధంగా గుర్తించాలి. ఇలాంటి వారికి ఎలాంటి ట్రీట్ మెంట్ ను ఇప్పించాలి. ముఖ్యంగా చేతులకి ఈ వణుకుడు సమస్య వస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అలాంటి వారు సాధారణ జీవితంలో ఎలాంటి సమస్యలతో సతమతమై పోతుంటారు.
శరీర బాగాలు వణకడాన్ని వైధ్య పరిభాషలో టిమ్మర్ అంటాము. టిమర్ అంటే మన ప్రమేయం లేకుండా ఒక క్రమ పద్దతిలో కదలడం. వారికి తెలియకుండానే వారి శరీర బాగాలు లేదా చేతులు వణుకుతుంటాయి. ఇలా వణకడానికి కారణాలను చూసినట్లైతే ఎక్కువగా పెద్దవారిలో ఈ షేకింగ్ కనిపిస్తుంది. అలా కాకుండా ప్రతి మనిషిలో ఈ టిమ్మర్ ఉంటుంది. గమనించినట్లైతే ఒత్తిడికి గురైనపుడు, కోపం వచ్చినప్పుడు, భయపడినప్పుడు కూడా శరీరం వణికిపోతుంటుంది. ఇంకా సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం వలన కూడా ఈ సమస్య బయటపడుతుంది. ఇంకా కొన్ని ప్రత్యేకమైన పనులను చేసేటపుడు కూడా అంటే సూదిలో దారాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నపుడు ఇలాంటి వణుకుడు సమస్య కనిపిస్తుంది ఇది సాధారణంగా అందరిలోనూ ఉంటుంది కానీ, కొన్ని సందర్భాలలో మాత్రమే ఇది బయటకు కనిపిస్తుంది.
శరీరబాగాలు వణకడం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఈ వణుకుడు సమస్య ఏ సందర్భంలో వస్తుంది. శరీరంలోని బాగాలు కాళ్ళు, చేతులు వణకడానికి కారణాలు ఏమిటి? అనే విషయాన్ని అనుసరించి దానికి సంబందించిన వ్యాధిని గుర్తించడం జరుగుతుంది. అదే విధంగా ఏ వ్యాధి యొక్క లక్షణాలను గుర్తించవచ్చు. ఫిజియాలాజికల్ టిమ్మర్(వణకడం) అనేది అందరిలో సాధారణంగా ఉంటుంది. అలా కాకుండా పెద్దవారిలో వచ్చే ఎసెన్సియల్ టిమ్మర్ ఇంకా థైరాయిడ్ సమస్య వలన కూడా ఈ సమస్య వస్తుంది. అలా కాకుండా చేతులను ఒక క్రమములో చాపి పెట్టినప్పుడు, ఏమైనా పనులు చేస్తున్నప్పుడు కూడా ఈ వణుకుడు సమస్య వస్తుంది. ఇంకా విశ్రాంతి సమయంలో కూడా, చేతులను ఖాళీగా ఉంచినప్పుడు కూడా వణకడం కనిపిస్తుంది. ఈ విధంగా ఏ సందర్భంలో వణుకుడు వస్తుందో తెలుసుకుంటే అది ఏ వ్యాధికి సంబందించిందో గుర్తించడం జరుగుతుంది. దానిని బట్టి వైధ్యులు చికిత్స చేస్తారు.
చేతులు వణకడం అనేది కొన్ని సార్లు ఒత్తిడి వలన, భయం వలన కూడా కనిపిస్తుంది. అలా కాకుండా పెద్దలలో కనిపించే టిమ్మర్ సమస్య నాడీ సంబందా వ్యాధులకు దారితీస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. మెదడు యొక్క పనితీరులో మార్పులు వచ్చినప్పుడు పెద్దవారిలో ఈ టిమ్మర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా పార్కిన్స్ వ్యాధి వలన అన్నీ సమయాలలో చేతులు వణుకుతాయి.