మనం తీసుకొనే ఆహారాల ప్రకారమే మన అవయవాల పనితీరు ఉంటుంది. అలాగే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. శరీరంలో ఎంతో కీలకమైన మూత్రపిండాలు ఏఏ ఆహారాల కారణంగా ప్రభావితమవుతాయి..? రెడ్ మీట్ ఎక్కువగా తినేవారిలో మూత్రపిండాలపై ఏదైనా ప్రభావం ఉంటుందా..?
రెడ్ మీట్ లో బి12, జింక్, ఐరన్, మరియు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. రెడ్ మీట్ గా చెప్పుకొనే గొర్రె మాంసం, పోర్క్, బీఫ్ తింటే గుండె జబ్బు, కాన్సర్ ప్రమాదం ఎక్కువ అవుతుందన్న మాట చాలాకాలంగా ప్రచారంలో ఉంది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితమైన అధ్యయనాలు లేవు. మితి మీరకుండా ఎంత తినాలో అంతే తింటే రెడ్ మీట్ వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదని కొంతకాలం క్రితం ఒక అధ్యయనంలో తేలింది. కొంతమంది రెడ్ మీట్ ను శరీరానికి మంచిదిగా భావించినప్పటికి చాలామంది దీనిని అనారోగ్యకర తిండిగానే భావిస్తారు. రెడ్ మీట్ లో ప్రొటీన్లు, మినరల్స్ బాగా ఉంటాయి. కాని ఒక తాజా స్టడీ మేరకు రెడ్ మీట్ అధికంగా తింటే అది మీ జీవిత కాలాన్ని తగ్గిస్తుందని తేలింది.
రెడ్ మీట్ అధికంగా తినడం వల్ల గుండెపై ప్రభావం చూపి రకరకాల సమస్యలు వస్తాయి. వీటిలో ఉండే శాట్యురేటెడ్ కొవ్వు గుండె ఆర్టరీలను బ్లాక్ చేసి మొండి జబ్బులను కలిగిస్తుంది. రెడ్ మీట్ అధికంగా తింటే ఎధిరోస్లెరోసిస్ అనే వ్యాధి వస్తుంది. జంతు సంబంధిత కొవ్వులు రక్తనాళాలలోని గోడలకు పట్టి బ్లాకేజీ ఏర్పడి గుండెపోటు కలిగిస్తాయి. రెడ్ మీట్ లో వుండే కొవ్వులు మాంసాహారులకు అనారోగ్యం కలిగిస్తాయి. రెడ్ మీట్ అధికంగా తినేవారిలో పేగు సంబంధ క్యాన్సర్, మహిళల్లో బ్రెస్ట్ క్యార్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే సైంటిఫిక్ గా ఇది ఇంతవరకు రుజువు కాలేదు. అలాగే అల్జీమర్స్ బారిన పడటం, ఊబకాయానికి గురవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.

రెడ్‌మీట్‌తో మూత్ర పిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతున్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. తరచుగా రెడ్ మీట్ తినే అలవాటు మూత్ర పిండాల పనితీరును దెబ్బతీస్తుందని డ్యూక్ మెడికల్ స్కూల్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రెడ్ మీట్‌ను ఎక్కువగా తినేవారికి మూత్ర పిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం 40 శాతం ఎక్కువని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా చేపలు, కోడి మాంసం, గుడ్లతోపాటు పాల ఉత్పత్తులతో శరీరానికి అవసరమైన పోషకపదార్థాలు లభిస్తాయని వారు సెలవిస్తున్నారు. రెడ్ మీట్ కు బదులుగా సాధ్యమైనంత వరకూ ఫిష్, చికెన్ లేదా ప్లాంట్ ప్రోటీన్స్ ను పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం.
రెడ్ మీట్ లేదా పోర్క్ తినడం వల్ల మూత్రపిండాలపై ఎక్కువగా ప్రభావం ఉంటుందని. అందుకని ఇకపై నుంచి మీరు కూడా రెడ్ మీట్ లేదా పోర్క్‌ను మితిమీరి తినకుండా జాగ్రత్తపడండి. మీ మూత్రపిండాలను కాపాడుకోండి