Sri Mahishasura Mardini Devi: దసరా మహోత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన దుర్గమ్మ మహార్నవమి నేడు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తున్నారు. మహిషాసురమర్దిని అవతారానికి ప్రత్యేకత ఉంది. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసురమర్దని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
అయిగిరినందిని ! నందితమేదిని ! విశ్వవినోదిని ! నందినుతే !
గిరివరవింధ్య శిరోధినివాసిని! విష్ణువిలాసిని! జిష్ణునుతే !
భగవతి ! హే శితికంఠకుటుంబిని ! భూరికుటుంబిని భూరికృతే !
జయజయ ! హే మహిషాసురమర్దిని ! రమ్యకపర్దిని! శైలసుతే !
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహిషాసురమర్దినీదేవిగా దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసురమర్దినీదేవి అలంకారములో ఉన్న శ్రీఅమ్మవారిని దర్శించడం వలన అరిష్ట్వర్గాలునశిస్తాయి, తత్ఫలితంగా సాత్వికభావం ఉదయిస్తుంది. సర్వదోషాలు పటా పంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి.
శరన్నవరాత్రులలో దర్శనమిస్తున్న దేవి అలంకారాలలో మహిషాసురమర్దనికి ఎంతో విశిష్టత ఉంది. సప్తశతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకో పకారం చేసిన ఘట్టం వర్ణితమైంది.. సింహావాహినిగా రూపొందిన శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురిడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, బాష్కులుడు, బిడాలుడు, వంటి రాక్షసులందరినీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్దంలో ఆ దేవి అవలీలగా మహిషాసురుణ్ణి చంపి అదే స్వరూపంతో కీలాద్రిపై స్వయంభువైంది. రౌద్రంలో ఉన్న అమ్మను శాంతిపచేసేందుకు ఇంద్రుడు తపస్సు చేసారు.
అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. అమ్మవారి సహజస్వరూపం ఇదే. మహిషాసుర మర్ధనని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశిస్తాయని, సాత్విక భావం ఏర్పడుతుంది. సర్వదోషాలు పటాపంచలై ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.








