Prasar Bharati Jobs: దూరదర్శన్ లో ఉద్యోగాలు జీతం రూ.80,000

By manavaradhi.com

Published on:

Follow Us
Prasar Bharati Jobs

మొత్తం ఖాళీల్లో.. సీనియర్‌ కరస్పాండెంట్‌-2, యాంకర్‌ కమ్‌ కరస్పాండెంట్‌ గ్రేడ్‌-2-7, యాంకర్‌ కమ్‌ కరస్పాండెంట్‌ గ్రేడ్‌-3-10, బులిటిన్‌ ఎడిటర్‌-4, బ్రాడ్‌కాస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌-4, వీడియో పోస్ట్‌ ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌-2, అసైన్‌మెంట్‌ కోఆర్డినేటర్‌-3, కంటెంట్‌ ఎగ్జిక్యూటివ్‌-8, కాపీ ఎడిటర్‌-7, కాపీ రైటర్‌-1, ప్యాకేజింగ్‌ అసిస్టెంట్‌-6, వీడియోగ్రాఫర్‌-5 ఉన్నాయి. ఎంపికైనవారిని చెన్నై, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్, రాంచీ, సిమ్లాల్లో నియమిస్తారు.

యాంకర్‌ కమ్‌ కరస్పాండెంట్‌ గ్రేడ్‌-2: డిగ్రీ, జర్నలిజం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా లేదా జర్నలిజం/ మాస్‌ కమ్యూనికేషన్‌/ విజువల్‌ కమ్యూనికేషన్‌ డిగ్రీ. సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. టెలికాస్ట్‌కు అనువైన స్పష్టమైన ఉచ్చారణ, సందర్భానుసారంగా స్వరాన్ని ప్రయోగించే నేర్పు, ప్రముఖులను ఇంటర్వ్యూ చేసే నైపుణ్యం, వెబ్, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ నిర్వహణలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

యాంకర్‌ కమ్‌ కరస్పాండెంట్‌ గ్రేడ్‌-3: డిగ్రీ, జర్నలిజం పీజీ డిప్లొమా లేదా జర్నలిజం/ మాస్‌ కమ్యూనికేషన్‌/ విజువల్‌ కమ్యూనికేషన్‌ డిగ్రీ. రెండేళ్ల అనుభవం ఉండాలి. ప్రాంతీయ/ జాతీయ/ అంతర్జాతీయ వర్తమానాంశాల పరిజ్ఞానం, స్పష్టమైన ఉచ్చారణ, స్వరాన్ని ప్రయోగించే నేర్పు, వెబ్, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ నిర్వహణలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

కంటెంట్‌ ఎగ్జిక్యూటివ్‌: డిగ్రీ, జర్నలిజం/ మాస్‌ కమ్యూనికేషన్‌ పీజీ డిప్లొమా లేదా జర్నలిజం/ మాస్‌ కమ్యూనికేషన్‌ డిగ్రీ. భాషా పరిజ్ఞానం, మూడేళ్ల అనుభవం ఉండాలి. కథనాలు, పరిశోధన, వార్తాంశాలు రాయడం, స్క్రిప్ట్‌ రైటింగ్‌ నైపుణ్యాలు ఉండాలి.

కాపీ ఎడిటర్‌: డిగ్రీ, జర్నలిజం/ మాస్‌ కమ్యూనికేషన్‌ పీజీ డిప్లొమా, భాషా నైపుణ్యంతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.

ఎంపిక: దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి పరీక్ష/ ఇంటర్వ్యూ లేదా రెండూ నిర్వహిస్తారు. ఒప్పంద ప్రాతిపదికన రెండేళ్లకు ఎంపిక చేసినప్పటికీ.. వ్యక్తి పనితీరు, సంస్థ అవసరాల నిమిత్తం పొడిగించే అవకాశం ఉంటుంది.

వయసు: యాంకర్‌ కమ్‌ కరస్పాండెంట్‌ గ్రేడ్‌-2కు 40 ఏళ్లు, యాంకర్‌ కమ్‌ కరస్పాండెంట్‌ గ్రేడ్‌-3కి 30 సంవత్సరాలు, కాపీ ఎడిటర్, కంటెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లకు 35 ఏళ్లు మించకూడదు. ప్రత్యేక వర్గాలకు చెందినవారికి గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21.10.2025

వెబ్‌సైట్‌: https://prasarbharati.gov.in/

Leave a Comment