Avika Gor – చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో పరిచయమై దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్ (Avika Gor) ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. టీవీ షోలో పెళ్లి చేసుకోవడంపై అవిక గోర్ స్పందించింది.. నా పెళ్లి గురించి జనాలు ఏం అనుకున్నా పట్టించుకోను అని తెల్చిచెప్పింది.
చిన్నారి పెళ్లికూతురు’గా మహిళా ప్రేక్షకుల మదిలో విశేష గుర్తింపుపొందిన నటి అవికా గోర్ (Avika Gor).. ఇటీవలే తన ప్రియుడు మిళింద్ చద్వానీని పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే, ఆమె ఓ టీవీ రియాలిటీ షోలో పెళ్లి చేసుకోవడంతో పలు విమర్శలు ఎదురయ్యాయి. ఆమె వెడ్డింగ్ లుక్‌పై కూడా నెట్టింట ట్రోల్స్ వచ్చాయి. తాజాగా దీనిపై ఈ జంట ఘాటుగా స్పందించింది. టీవీ కార్యక్రమంలో పెళ్లి చేసుకోవాలనేది తనకు చిన్నప్పటి కోరిక అని అవికా అన్నారు. తన నిర్ణయం సరైనదేనని చెప్పారు.
టీవీ కార్యక్రమంలో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని మిళింద్‌కు తెలిపినప్పుడు తను అంగీకరించాడు. ప్రజలు విమర్శిస్తారని ముందే చెప్పాడు. డబ్బు కోసమే అలా చేస్తున్నామని విమర్శలు వస్తాయని తెలిపాడు. కానీ, నా నిర్ణయంపై మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం. మిళింద్ అంగీకరించడమే నాకు ముఖ్యం. ప్రజల గురించి పట్టించుకోను. ఇక నా పెళ్లి తంతు మొత్తం సంప్రదాయంగా జరిగింది. అందుకే కొందరు నా వెడ్డింగ్ లుక్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ట్రోల్స్ నా భర్త లుక్స్‌పై వచ్చిఉంటే నేను బాధపడేదాన్ని.. ఎందుకంటే ఆయన లుక్‌ను నేను డిజైన్ చేశాను. అలా రానందుకు ఆనందంగా ఉంది’’ అని అవికా అన్నారు.

ఇక టీవీ కార్యక్రమంలో పెళ్లి చేసుకోవడంపై వచ్చిన విమర్శలను ఉద్దేశిస్తూ.. అవికా భర్త మిళింద్ (Milind Chandwani) మాట్లాడారు. ఈరోజుల్లో కనీసం 50 మంది ఫొటోగ్రాఫర్లు, వీడియో రికార్డు చేసేవారు లేకుండా ఏ పెళ్లి జరగడం లేదన్నారు. అందరి పెళ్లిళ్లలో ఇలాంటివి కామన్ అన్నారు. అవికా మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇక ఓ హిందీ రియాలిటీ షోలో సెప్టెంబర్ 30న వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే.










