APDLSA Recruitment 2025 – ఏపీ జిల్లా కోర్టులో ఉద్యోగాలు

By manavaradhi.com

Published on:

Follow Us
AP District Court Jobs Latest Notification 2025

APDLSA Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ (A.P. State Legal Services Authority) ఆధ్వర్యంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA), కర్నూల్ లోని ADR / Mediation Centre లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు పూర్తిగా ఔట్‌సోర్సింగ్ విధానంలో జరుగుతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 నవంబర్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలి.

ఖాళీల వివరాలు : DLSA కర్నూల్ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు ADR / Mediation Centre, Nyaya Seva Sadan, Court Complex, Kurnool లో పనిచేయాల్సి ఉంటుంది.
L.D. Steno – 1 పోస్టు (SC – మహిళ)
Typist cum Assistant – 1 పోస్టు (Open Category)
Record Assistant – 1 పోస్టు (OC – మహిళ)

ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు చేయడానికి 5 నవంబర్ 2025 నుండి 15 నవంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు అవకాశాన్ని వినియోగించుకోండి.

విద్యా అర్హత: రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి పదవ తరగతి అర్హత ఉంటే చాలు టైపిస్ట్ పోస్టుకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు టైపింగ్ చేయడం తెలిసి ఉండాలి.
వయస్సు: కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తులు చేయవచ్చు.

ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది పరిశీలించిన తర్వాత అభ్యర్థులు తెలిపిన ఫార్మేట్ లో అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ జత చేసి న్యాయ సేవా సదన్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, కోర్ట్ కాంప్లెక్స్, కర్నూల్ కార్యాలయంలో 15 నవంబర్ 2025 లోపు వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా పంపించవచ్చు.

Leave a Comment