Gold and Silver Prices: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

By manavaradhi.com

Updated on:

Follow Us
Gold and Silver Prices

Gold and Silver Prices: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం దిగి వస్తున్నాయి. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. బంగారం ధర తులంపై దాదాపు రూ.2 వేల వరకు తగ్గగా.. కిలో వెండి ఏకంగా రూ.8వేలకు పైగా పడిపోయింది.. దీంతో, బంగారం, వెండి కొనే ప్లాన్‌ చేసుకునే వారికి ఇది మంచి అవకాశంగా కనిపిస్తుంది.

ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ1,960 తగ్గడంతో రూ.1,25,080కి దిగివచ్చింది.. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ1,800 తగ్గడంతో రూ.1,14,650కి పడిపోయింది.. మరోవైపు కిలో వెండి ధర రూ.8,100 తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,75,000కు దిగివచ్చినట్టు అయ్యింది.

డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరిగే కొద్దీ అమెరికా ఫెడరల్ రిజర్వు జారీ చేసే ట్రెజరీ బాండ్లను పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే అమెరికా జారీ చేసే ఈ ట్రెజరీ బాండ్ల పైన రాబడి అందిస్తుంది.

Leave a Comment