APSRTC Apprentice recruitment 2025 : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 291 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలు:
సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)
పోస్ట్ పేరు: అప్రెంటిస్ (వివిధ ITI ట్రేడ్‌లు)
మొత్తం పోస్టులు: 291

వయస్సు: అప్రెంటిస్‌షిప్ చట్టం నిబంధనల ప్రకారం అభ్యర్థుల వయస్సు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీహెచ్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
విద్యార్హత: అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజీ నుంచి ITI కోర్సు పూర్తి చేసి ఉండాలి. NCVT సర్టిఫికేట్ తప్పనిసరి.
అప్లికేషన్లకు చివరి తేదీ: నవంబర్ 30 వ తేదీ వరకు అభ్యర్ధులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: ఈ పోస్టుల కోసం అప్లై చేయాలనుకునే అభ్యర్థులు రూ. 118 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
మెరిట్ లిస్ట్ : ఎంపిక పూర్తిగా ITI (NCVT/SCVT) మార్కుల ఆధారంగా ఉంటుంది. ఇందుకు ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్:
మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి అభ్యర్థులను సంబంధిత APSRTC ప్రాంతీయ ఆఫీసుల్లో సర్టిఫికేట్/డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు SSC మార్క్స్ మెమో, ITI మార్క్స్ మెమో, NTC/NCVT సర్టిఫికేట్, ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్ వంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి.
- ఫైనల్ లిస్ట్:
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఎంపికైన అప్రెంటిస్‌లఫైనల్ లిస్ట్ APSRTC ద్వారా విడుదల చేస్తారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు వారికి కేటాయించిన డిపోలో శిక్షణ షెడ్యూల్, రిపోర్టింగ్ తేదీ, అప్రెంటిస్‌షిప్ సమయానికి సంబంధించిన సూచనలను తెలియచేస్తారు
స్టైఫండ్ :
APSRTC Apprentice recruitment 2025 అప్రెంటిస్ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
APSRTC Apprentice recruitment 2025 అభ్యర్థులు ముందుగా NAPS పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పోర్టల్ లో అప్లికేషన్ ఫారమ్ నింపిన తర్వాత మీ ప్రొఫైల్ పైన “Apprentice Opportunities” పై క్లిక్ చేయాలి. అక్కడ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఆన్ లైన్ లో అప్లయ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 15 నవంబర్, 2025
దరఖాస్తులకు చివరి తేదీ : 30 నవంబర్, 2025









