Team India: టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఈ జెర్సీతోనే బరిలోకి దిగుతుంది..!

By manavaradhi.com

Published on:

Follow Us
Team India's T20 World Cup 2026 jersey revealed

Team India: వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టు జెర్సీని సిద్ధం చేశారు. దక్షిణాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, తిలక్‌ వర్మ జెర్సీని ఆవిష్కరించారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ఈ టోర్నీ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది. పాకిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాతో పాటు భారత్‌ గ్రూప్‌ ‘ఎ’లో ఉంది. ఫిబ్రవరి 7న అమెరికాతో పోరుతో టీమ్‌ఇండియా టైటిల్‌ వేట మొదలవుతుంది.

టీ20 ప్రపంచకప్‌ కోసం సిద్ధం చేసిన జెర్సీ కాస్త బిన్నంగా ఉంది. జెర్సీపై నిలువుగా లైన్స్ వచ్చాయి. ఆరెంజ్ కలర్ కూడా అదనంగా ఉంది. కొత్త జెర్సీకి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఫిబ్రవరి 7న అమెరికాతో భారత్ మొదటి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది.

Leave a Comment