VSSC Jobs 2025: ఇస్రో- విక్రమ్‌ సారాబాయ్‌ స్సెస్‌ సెంటర్‌లో ఉద్యోగాలు

By manavaradhi.com

Published on:

Follow Us
VSSC Jobs 2025

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఆధ్వర్యంలోని కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (VSSC).. 2025-26 సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ డిప్లొమా అప్రెంటిస్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల కోసం దరఖాస్తులను అహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 90 గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ డిప్లొమా అప్రెంటిస్‌ ట్రైనీ ఖాళీలను ఎటాంటి రాత పరీక్షలేకుండానే సెలక్షన్‌ డ్రైవ్‌ అంటే ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయనుంది. మొత్తం పోస్టుల్లో జనరల్‌ స్ట్రీమ్‌ (నాన్‌ ఇంజినీరింగ్‌) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు 23, డిప్లొమా టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులు 67 వరకు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్‌ 29, 2025వ తేదీన జరిగే ఎంపిక డ్రైవ్‌కి నేరుగా హాజరుకావచ్చు.

పోస్టు పేరు-ఖాళీలు

  • జనరల్‌ స్ట్రీమ్‌ (నాన్‌ ఇంజినీరింగ్‌) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 23
  • డిప్లొమా టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 67
    మొత్తం పోస్టుల సంఖ్య: 90
    అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అప్రెంటిస్‌ శిక్షణ పొందినవారు అనర్హులు.
    వయోపరిమితి: 31.12.2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు. (ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది).
    స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌కు రూ.9000; డిప్లొమా టెక్నీషియన్‌కు రూ.8000.
    దరఖాస్తు విధానం: అభ్యర్థుల దరఖాస్తులను కేవలం సెలక్షన్‌ డ్రైవ్‌ (వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ) రోజున మాత్రమే స్వీకరిస్తారు. (ముందుగా ఎన్‌ఏటీ పోర్టల్‌లో https://nats.education.gov.in/ నమోదు చేసుకోవాలి).
    వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ తేదీ: 29.12.2025.
    వేదిక: వి.ఎస్.ఎస్.సి గెస్ట్ హౌస్, ఏ.టి.ఎఫ్ ఏరియా, వేలి, వేలి చర్చికి దగ్గర, తిరువనంతపురం జిల్లా, కేరళ.

Official Website : https://www.vssc.gov.in/careers.html

Leave a Comment