Watery Eyes: కంటి నుంచి తరుచూ నీరు కారుతోందా? ఇలా చేయండి!

By manavaradhi.com

Published on:

Follow Us
Watery Eyes

కళ్లలో .. దుమ్ము, ధూళి కణాలు పడ్డా గానీ . . విపరీతమైన దురద , మంట కలుగుతుంది. ఫలితంగా కళ్లలో నుంచి నీరు కారుతుంది. అంటే కళ్లలో పడ్డ ఆ చిన్న కణాలను సైతం బయటకు నెట్టివేసేందుకు… కళ్లు.. ప్రయత్నిస్తాయన్నమాట. అలాగే కళ్లకు ఇన్ఫెక్షన్లు.. ఇతరత్రా సమస్యలు ఎదురైనప్పుడు కూడా కంటి వెంబడి నీరు కారుతుంది. ఇలాంటప్పుడు సమస్యను గుర్తించి త్వరగా చికిత్స తీసుకోవాలి. కళ్ల నుంచి నీరు కారడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.

సాధారణంగా కనిపించే కంటి సమస్య . . కళ్లు పొడిబారడం . ఎక్కువగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు చూడడం వల్ల గానీ .. వాతావరణంలో గాలి ఎక్కువగా ఉన్న కారణంగా గానీ కళ్లు పొడిబారడం జరుగుతుంది. ఆ తర్వాత కళ్లలో దురద ఉన్నట్లు అనిపిస్తుంది. కంటిలోని నీటి గ్రంథులు . . ఒక్కోసారి తగినంత నీటిని ఉత్పత్తి చేయకపోవడం కూడా కళ్లు పొడిబారిపోవడానికి కారణం కావచ్చు. ఈ సమస్య కొద్ది కాలమే ఉంటుంది. ఐతే శరీరానికి నీరు ఎక్కువగా అందేలా చూసుకోవడం .. స్మార్ట్ గ్యాడ్జెట్లు చూడడం తగ్గించడం . . వీలైనంత వరకు కనురెప్పలు మూస్తూ , తెరుస్తూ .. కంటిలోని నీటి గ్రంథులు తిరిగి సరిగ్గా పని చేసేలా చేసుకోవడం చాలా ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది.

పింక్ ఐ .. ఇదో రకమైన కంటి సమస్య. దీన్ని కంజుక్టివిటీస్ అని కూడా వైద్య పరిభాషలో వ్యవహరిస్తారు. ఈ సమస్య వస్తే కంటి నుంచి నీరు కారడమే కాకుండా కళ్లు గులాబీ రంగులో కి మారతాయి. కంటిలో నుంచి నీరు ఎక్కువగా కారుతుంది. పిల్లలు, పెద్దల్లోనూ ఈ సమస్యకు మినహాయింపు ఉండదు. అలాగే ఒక కంటిలో లేదా రెండు కళ్లలోనూ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్య వచ్చిన వారిలో కంటిలో దురదతోపాటు ఇన్ఫెక్షన్ ఉంటుంది. కళ్లు చూడడానికి గులాబీ రంగులో కనిపిస్తాయి. బ్యాక్టీరియా లేదా వైరస్ ల వల్ల ఈ సమస్య తలెత్తుతుందని వైద్యుల చెబుతున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స అవసరం లేదని .. ఐతే బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ కు యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్ అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. సాధారణంగా వచ్చే అలర్జీలు కూడా కంటిలో నీరు కారేలా చేస్తాయి. అలర్జీల ద్వారా వచ్చే దగ్గు, జలుబు .. కంటిలో దురద కలిగిస్తాయి. ఫలితంగా కళ్లలో నుంచి అదే పనిగా నీరు కారుతుంది. అలర్జీలకు మందులు వాడుకుంటే ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. ఐతే అలర్జీ సమస్యలు రాకుండా దూరంగా ఉండాలి. అంటే వాతావణంలో పుప్పొడి, పెంపుడు జంతువుల ద్వారా వచ్చే అలర్జీలపై జాగ్రత్త వహించాలి..

సాధారణంగా… కంటి పైన ఉన్న కన్నీటి గ్రంథుల నుంచి కన్నీళ్లు ప్రవహిస్తాయి. కంటిలోని గుడ్డు ఉపరితలం నుంచి మూలలోని నాళాల్లోకి కన్నీరు ప్రవహిస్తుంది. కానీ మూలల్లో ఉన్న నాళాలు సరిగ్గా పని చేయని పక్షంలో కన్నీరు అలాగే కంటి నుంచి కిందకు కారుతుంది. ఇందుకు చాలా విషయాలు కారణం కావచ్చు. వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, గాయాలు , వృద్ధాప్యం వంటి సమస్యల కారణంగా ఇలా జరుగుతుంది… కనురెప్పలు కూడా కళ్లకు నిరంతరం రక్షణగా నిలుస్తాయి. ఇంకా చెప్పాలంటే .. కారుకు ఉండే విండ్ షీల్డ్ లేదా వైపర్ లా ఇవి రక్షణ కలిగిస్తాయి. కనురెప్పలు మూసి, తెరిచినప్పుడు .. కంటిలో ఉన్న అదనపు తేమను తుడిచి వేస్తాయి. కానీ ఒక్కోసారి ఇవి సరిగ్గా పని చేయక కళ్లపై వ్యతిరేక దిశలో రుద్దుతాయి. ఇలాంటి సమస్యను ట్రోపియన్ అంటారు. ఈ సమస్య వల్ల కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. దీనికి శస్త్రచికిత్స చేసి శాశ్వతంగా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. కళ్లను అనవసరంగా రుద్దడం ద్వారా కొన్నిరకాల సమస్యలు వస్తాయి. కంటిలో దుమ్ము రేణువులు లేదా కాంటాక్ట్ లెన్స్ లు సరిగ్గా ధరించకపోవడం వల్ల కార్నియాలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే కన్ను చిరిగిపోవచ్చు. దీంతో అది ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఈ గీతలు సాధారణంగా ఒకటి లేదా రెండు రోజుల్లో నయం అవుతాయి. కానీ అలా జరగని పక్షంలో కచ్చితంగా వైద్యున్ని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి.

కంట్లో పదేపదే నీరు కారుతుంటే ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు . చాలామంది తుడుచుకుంటే అదే తగ్గుతుందనే ధోరణలో ఉంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదు. కంటి సమస్యలను చిన్నగా ఉన్నప్పుడే గుర్తించి చికిత్స చేయించుకుంటే త్వరగా తగ్గిపోతాయి. సమస్య పెద్దదైన తర్వాత ఐతే శస్త్రచికిత్సలు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మరో విషయం ఏంటంటే .. ప్రతి ఆరు నెలలకోసారి విధిగా కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది. గ్లకోమా ఇతరత్రా కంటి సమస్యలను ముందస్తుగానే గుర్తించే అవకాశం లభిస్తుంది. ఫలితంగా చికిత్స ఆలస్యం కాకుండా ఉంటుంది.

Leave a Comment