Deputy CM Pawan Kalyan: మాట నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్

By manavaradhi.com

Published on:

Follow Us
Dy CM K. Pawan Kalyan laid the foundation stone for the modernization works of the Shankaraguptam Major Drain

Deputy CM Pawan Kalyan: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. కోనసీమ కొబ్బరి రైతులకు సమస్యల పరిష్కారానికి 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకర గుప్తంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు.. రాజోలు పర్యటనలో 45 రోజుల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ హామీ ఇచ్చిన విషయం విదితమే.. అయితే, 35 రోజుల్లోపే సమస్యకు పరిష్కారం చూపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌.

Leave a Comment