భారతీయ తపాలా శాఖ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 28,740 జీడీఎస్(గ్రామీణ డాక్ సేవక్) ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాసైన అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎపికైన అభ్యర్థులు స్థానిక గ్రామీణ కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది.
🔹దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 14
ఇండియా పోస్ట్ GDS రిక్రూట్మెంట్ 2026కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థి తప్పనిసరిగా భారతీయ పౌరుడు అయి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. 10వ తరగతిలో గణితం, ఆంగ్ల సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జనరల్, OBC అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, దివ్యాంగ అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఈ నియామక డ్రైవ్ 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 28,740 ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది.









