హైదరాబాద్: తెలంగాణలో సినిమా థియేటర్ల టికెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ ఏసీ, ఏసీ థియేటర్లతో పాటు స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ల ధరలకు కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను ప్రభుత్వం నిర్ణయించింది.
ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం..
నాన్ ఏసీ థియేటర్లలో:
నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ ధర కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70గా నిర్ణయించారు. ప్రీమియం కేటగిరీ టికెట్ ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100గా ఉంది.
ఏసీ థియేటర్లలో:
నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150గా నిర్ణయించారు. ప్రీమియం కేటగిరీ టికెట్ ధర కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200గా ఉంది.
స్పెషల్ థియేటర్లలో:
నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ ధరలు కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250గా నిర్ణయించారు. ప్రీమియం రిక్లయినర్ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300గా ప్రభుత్వం పేర్కొంది.
మల్టీప్లెక్స్‌లలో:
రెగ్యులర్ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250గా నిర్ణయించారు. రిక్లయినర్ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300గా ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఆయా కేటగిరీల్లో సినిమా టికెట్ల ధరలను నిర్ణయించుకునే అవకాశం థియేటర్లకు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.









