క్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ కథాంశంతో కూడిన వినోదాత్మక చిత్రంగా రూపొందిస్తున్నారు.
తాజాగా చిత్రబృందం టైటిల్‌తో పాటు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ‘జనవరి 12 విడుదల – బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే పేరును ఖరారు చేసినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించింది. టైటిల్ రివీల్ చేస్తూ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది.
ఈ ప్రకటనతో సినిమాను వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు స్పష్టమైంది. అనిల్ రావిపూడి గత చిత్రాల తరహాలోనే ఈ సినిమాపైనా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.









