Puri Shree Jagannatha Temple – జగన్నాథ వైభవం.. పూరీ రహస్యాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Shree Jagannatha Temple Puri

సర్వ జగతిని సృష్టించి, పాలించి, లయింపజేసే నాథుడే జగన్నాథుడు. ధర్మ రక్షణ కోసం, భక్తుల భావన కోసం, తారణ కోసం ఆ విశ్వచైతన్యమూర్తి శ్రీకృష్ణునిగా అవతరించాడు. ఆ పరమాత్ముడు శేషస్వరూపుడైన సోదరుడు బలభద్రునితో, సోదరిగా వచ్చిన పరాశక్తి (పద్మనాభ సహోదరి) సుభద్రతో వెలసిన దివ్యక్షేత్రం పురుషోత్తమ క్షేత్రం. మనం ‘పూరీ’ అని వ్యవహరించే ఈ క్షేత్రాన్ని పురాణాలు ‘పురి’ అని పేర్కొన్నాయి. ప్రపంచంలో అరుదైన అద్భుతాలెన్నో ఈ క్షేత్రంలో ఉన్నాయి. ఒక మహాగ్రంథమంత విస్తృతి కలిగిన అద్భుతాలకీ, చరిత్రకీ, విష్ణుశక్తికీ ఆలవాలమైన క్షేత్రమిది.

ఉత్తర భారతదేశం ఒడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో అత్యంత ప్రసిద్ధమైనవి పూరీ జగన్నాథ ఆలయం ఉంది. పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలియని హిందువులూ ఉండరు. పూరీ జగన్నాథ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేశారు. పూరీ జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. జగన్నాథుడు జగత్ (విశ్వం), నాథ్ (ప్రభువు) అని అర్థం.

శ్రీకృష్ణుడి నిర్యాణం అనంతరం అంత్యక్రియలు జరిగినప్పుడు పార్థివ శరీరంలో నాభిభాగం కాలలేదు. ఆ భాగాన్ని సముద్రలో పారవేశారు. అది కొంతకాలానికి సముద్రంలో నల్లటి విష్ణుమూర్తి శిలగా మారింది. విశ్వావసుడుసవర ( గిరిజన) జాతికి చెందని గిరిజనుడికి ఈ శిల దొరుకుతుంది. ఈ విగ్రహాన్ని నీలమాధవుడి పేరుతో ప్రతిష్టించి విశ్వావసుడు పూజలు చేస్తుండేవాడు. అతడు సమర్పించే అన్నం, పండ్లను విష్ణుమూర్తి మానవ రూపంలో వచ్చి తినేవాడు.ఈ విషయాన్ని నారదుడు ద్వారా మాళవదేవపు రాజు ఇంద్రద్యుమ్నుడికి తెలుస్తుంది. దీంతో రాజు తన మనుషులను పంపి వెతికిస్తాడు. ఓ బ్రాహ్మణుడు… రాజు నీలమాధవుడి జాడ చెబుతాడు. ఇంద్రద్యుమ్నుడు వెళ్లి చూడగా విగ్రహం అదృశ్యమవుతుంది.

ఓ రాత్రి విష్ణుమూర్తి స్వయంగా ఇంద్రద్యుమ్నుడికి కలలో కనిపిస్తాడు. అశ్వమేథ యాగం చేస్తే తన విగ్రహం చెక్కరూపంలో సముద్రంలో లభిస్తుందని చెబుతాడు. ఇప్పటి గుండిచ ఆలయం వద్దే ఆ రాజు అశ్వమేథ యాగం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. తరువాత సముద్రంలో ఆ రాజుకు ఒక పెద్ద చెక్క దుంగ కొట్టుకుని వస్తూ కనిపిస్తుంది. శిల్పులను పిలిపించి విష్ణుమూర్తి విగ్రహం చెక్కాలని కోరుతాడు. అయితే ఆ శిల్పులు పని ప్రారంభించగానే పనిముట్లు పనిచేయకుండా పోతాయి.

ఇదే సమయంలో విష్ణుమూర్తి స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. ఆ పని తాను పక్క గదిలో 21 రోజుల్లో చేసి పెడతానని… కాని ఎవరూ మధ్యలో వచ్చి తలుపులు తెరవకూడదని చెబుతాడు. కానీ 15 రోజులకే ఆ రాజు కుతూహలం కొద్దీ తలుపు తెరవగా విష్ణుమూర్తి అదృశ్యమవుతాడు. విగ్రహాలు అసంపూర్తిగా ఉంటాయి. నడుము కింది భాగం, కాళ్లు చేతులు లేకుండానే విగ్రహం ఉంటుంది. ఇంద్రద్యుమ్నుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపపడతాడు.

వీటిని ఆలయంలో ఎలా ప్రతిష్ఠించాలన్న సందిగ్దంలో రాజు పడతాడు. అయితే.. ఆ రోజు రాత్రి మహావిష్ణువు మళ్లీ ఇంద్రద్యుమ్న కలలో కనిపించి.. మహారాజా.. బాధ పడకు. ఇది నా సంకల్పమే. ఆ శిల్పి ఎంత వరకు చెక్కాడో… ఆ శిల్పాలనే ఆలయంలో ప్రతిష్ఠించు. నేను ఆ రూపాలతోనే కొలువు తీరుతాను. జగన్నాథుడిగా పేరొందుతాను.. అని చెబుతాడు మహావిష్ణువు. దీంతో ఆ మూల విరాట్ మూర్తులనే రాజు ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ.. అలాగే ఆ మూల విరాట్టు విగ్రహాలు జగన్నాథ్ పూజింపబడుతున్నాయి.

తరువాత యయాతి కేసరి అనే రాజు దేవాలయాన్ని విస్తరిస్తాడు. రెండు ప్రాకారాలు, రాజగోపురం కట్టిస్తాడు. క్రీస్తుశకం 1140 ల కాలంలో చోడ గంగమహాదేవుడు ఎత్తైన గోపురం నిర్మించి దానిపై అష్టధాతువులతో తయారైన చక్రం తయారు చేయిస్తాడు. ఇతడి కుమారుడు అనంగమహారాజు ప్రస్తుత దేవాలయ ప్రాకారంలోని పలు దేవాలయాలను నిర్మించాడు. ఈ ప్రాకారాల్లో అలోక్‌నాథ్, లక్ష్మీనరసింహస్వామి, వరాహ స్వామి మందిరాలు కూడా ఉన్నాయి.

పూరీ జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగాదేవి గారు ప్రారంభించారు. జగన్మోహన, విమన భాగాలు అతని హయాం ( 1078–1148) లోని పూరీ జగన్నాధ ఆలయం నిర్మాణం పూర్తి అయ్యింది. ఒడిశా పాలకుడైన అనంగ భీమ్ దేవ1174 లో పూరీ జగన్నాథ ఆలయం పునర్నిర్మించారు. ప్రస్తుతం ఉన్న పూరీ జగన్నాథ దేవాలయం 12 శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ నిర్మాణం ప్రారంభం చేసారు. ఆయన మనుమడు రాజా అనంగభీమదేవ్ నిర్మాణం పూర్తి చేసారు. పూరీలో రాజు ఆ ఆలయాన్ని నిర్మించడం వల్ల ఆ ఆలయానికి పూరీ జగన్నాథ్ ఆలయం అని పేరు వచ్చింది. ఇది పూరీ జగన్నాథుడు వెలిసిన చరిత్ర.

‘జగన్నాథస్వామీ నయన పథగామీ భవతుమే’ అని ఆదిశంకర భగవత్పాదులు ఈ స్వామి తన కళ్లముందు నిరంతరం కదలాడాలని ప్రార్థించి, తన నాలుగు పీఠాలలో ఒక దానిని ఇక్కడే ప్రతిష్ఠించారు. గరతీరాన వెలసిన ఈ క్షేత్రం శ్రీకృష్ణ భక్తిసముద్రుడైన చైతన్య మహా ప్రభువులకు ఆరాధ్యమై, ముక్తిధామమయ్యింది. జయదేవుని ‘గీత గోవిందం’ ఈ స్వామి ఆరాధనయే. ఈ మూర్తులలో జగన్నాథుని మూర్తి విలక్షణమైనది. అందులోనూ నయనాల శోభ ప్రత్యేకం. అవి చక్ర నయనాలు. అనంత దృష్టికి ప్రతీకలు. రెప్పలులేని కళ్లు భక్తులను రెప్పపాటు కూడా లేకుండా కరుణతో వీక్షించే నారాయణుని దయాంతరంగాన్ని చాటుతున్నాయి. ఎక్కడా జరగని ఒక ప్రత్యేక రథోత్సవం ఈ క్షేత్రంలో ఏటా (ఆషాడ శుద్ధ విదియ నాడు) జరుగుతుంది. జగత్ ప్రసిద్ధి చెందిన ఈ జగన్నాథ రథోత్సవం ఒక దివ్యానుభవం.

Leave a Comment