Ulcerative colitis:పేగు పూత సమస్యా.. ఇలా జాగ్రత్త పడండి.. లేదంటే..!

By manavaradhi.com

Published on:

Follow Us
Ulcerative colitis

పెద్దపేగులోని పురీష ప్రాంతంలో ఎదురయ్యే సమస్యే అల్సరేటివి కొలిటిస్. ఏ వయసులోనైనా వచ్చే ఈ సమస్య వల్ల పేగులో ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెంది, అనేక సమస్యలు సృష్టిస్తాయి. ఎక్కువగా జన్యుపరమైన కారణాల వల్ల ఎదురయ్యే అల్సరేటివ్ కొలిటిస్ ఒక్కోసారి అధిక ఒత్తిడి వల్ల కూడా రావచ్చు.

శరీరంలోని ఇతర వ్యవస్థలలాగానే మనస్సు, జీర్ణ వ్యవస్థ ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి. అనేక రకాల జీర్ణకోశ సమస్యలు , మానసిక సమస్యల కారణంగా కలగడం, అధికం కావడం జరుగుతుంటాయి. మన మానసిక స్థితి, భావోద్రేకాలు, వ్యక్తిత్వం, మనం ఒత్తిడిని తట్టుకునే తీరు, మన అలవాట్లు మొదలైనవి మన జీర్ణకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. మనిషి శరీర పోషణకు కీలకమైనది జీర్ణ వ్యవస్థ. మనం తీసుకునే ఆహారం ఇక్కడే జీర్ణమై, శక్తిగా మారి శరీరానికి అందుతుంది. అలాంటి జీర్ణవ్యవస్థకు ఏర్పడే సమస్యల్లో అల్సరేటివ్ కొలిటిస్ ఒకటి.

జీర్ణాశయం పనితీరును పరిశీలిస్తే…. అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్దపేగు అని వివిధ భాగాలు దీన్ని విభజిస్తారు. నోటితో నమిలి మింగిన ఆహారం అన్నవాహిక ద్వారా నేరుగా జీర్ణాశయంలోకి చేరుతుంది. జీర్ణాశయం దాన్ని జీర్ణరసాలతో కలిపి బాగా చిలుకుతుంది. అలా జావలా మారిన ఆహారం గంట నుంచి గంటన్నర లోపు చిన్న పేగులోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించి, రక్తంలోకి చేరవేస్తుంది. ఇలా దాదాపు 4 గంటల పాటు ఇక్కడ జరిగే జీర్ణ ప్రకియే శరీరానికి ఆధారం. అలాంటి చోట వాపు, పూత, పుండ్ల సమస్య ఎదురైందంటే… శరీరానికి అందే పోషణ దాదాపు నిలిచిపోయినట్లే. ఇలాంటి సమస్యలనే ఇన్ ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ గా వ్యవహరిస్తారు.

వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసిన వాటిలో అల్సరేటివ్ కొలైటిస్ కూడా ఒకటి. పెద్ద పేగుకు వచ్చే ఈ సమస్య పేగులో వాపు, పూతతో పాటు పండ్లతోనూ వేధిస్తుంది. ముఖ్యంగా మృదు కణజాలం శ్లేష్మపు పొర మీద దీని ప్రభావం ఉటుంది. ఈ సమస్య ఎదురు కావడానికి పూర్తి కారణాన్ని చెప్పలేం. కాని ఈ సమస్యతో బాధపడుతున్నవారు అధిక ఒత్తిడికి గురిఅయితే వారి పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.

అల్సరేటివ్ కొలిటిస్ వచ్చిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా క్రిములు విజృంబించి సమస్యలు తెచ్చిపెడతాయి. ఈ సమస్యలకు తోడు మానసిక ఒత్తిడి, ఇతర అనారోగ్యకరమైన అలవాట్లు తోడైతే… ఈ సమస్యలు మరింత పెరుగుతాయి. ఏ వయసు వారికైనా ఇది తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువగా 15 నుంచి 30 సంవత్సరాల మధ్య, 50 నుంచి 70 సంవత్సరాల మధ్య ఈ సమస్య ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ.

ఒత్తిడికి గురైనప్పుడు మీ శరీరం ఫైట్ మోడ్‌లోకి వెళుతుంది. ఇది సైటోకిన్‌లతో సహా అనేక రసాయనాల విడుదలను ప్రేరేపిస్తుంది. అవి మీ రోగనిరోధక వ్యవస్థను ఆన్ చేసి మంటకు దారితీసే అణువులు. అల్సరేటివ్ కొలిటిస్ ఉన్న వ్యక్తులకు ఈ ప్రక్రియకు మరింత సున్నితంగా ఉండవచ్చు. ఒత్తిడి మీ మెదడు మరియు గట్ మధ్య ప్రయాణించే సంకేతాలను మారుస్తుంది. ఇది అల్సరేటివ్ కొలిటిస్ లేని వ్యక్తులలో కూడా అన్ని రకాల జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ మార్పులు కూడా ఆహార అలెర్జీలు మరియు గుండెల్లో మంటతో ముడిపడి ఉన్నాయి.

అల్సరేటివ్ కొలిటిస్ ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే ఇది ఇతర అనేక వ్యాధులకు దారి తీయవచ్చు. ఈ సమస్య పూర్తిగా నయం కావడం కష్టం. కానీ మందులతో ఇతర సమస్యలను కొంత వరకూ తగ్గించవచ్చు. దీనికి వైద్యులు సూచించిన మందులు వాడుతూ ఉండాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆహారంలో జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. ఏయే ఆహార పదార్థాలు తింటే సమస్య వస్తుందో గుర్తించి వాటికి దూరంగా ఉండడం మేలు. ముఖ్యంగా ఎక్కువ మందిలో కొవ్వు పదార్థాలు మానేయడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.

వైద్యుల సూచనే మేరకే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అర్సరేటివ్ కొలిటిస్ అదుపులో ఉంటుంది. అలాగే ఒత్తిడిని తగ్గించే మార్గాలు చాలానే ఉన్నాయి.ఒత్తిడిని పూర్తిగా వదిలించుకోలేరు. కానీ దానిని నిర్వహించడం నేర్చుకోవచ్చు. మరియు మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మీ జీవిత నాణ్యతను పెంచుకోవచ్చని అధ్యయనాలు చూపుతున్నాయి. ఎక్కడ ప్రారంభించాలో మీకు తెలియకపోతే అదనపు సహాయం కోసం మీ వైద్యుడిని అడగండి. మీరు విశ్రాంతి తీసుకునే ఏదైనా చేయడానికి ప్రతిరోజూ కొంచెం సమయం కేటాయించవచ్చు. అది తోటపని, చదవడం లేదా సంగీతం వినడం కావచ్చు. మీరు ఆనందించేది ఏదైనా ఆటలు ఆడడం వంటివి చేయాలి.

Leave a Comment