ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది. విజువల్స్, కథ, స్టార్ కాస్ట్ అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. సహజంగానే సీక్వెల్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్లో హీరోయిన్ దీపికా పదుకొనే భాగం కాబోరని అధికారికంగా ప్రకటించారు.
ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. ‘‘జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మేం ఒక నిర్ణయానికి వచ్చాం. ‘కల్కి’ సీక్వెల్లో దీపిక భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాం. తొలి భాగం కోసం ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ రెండో పార్ట్‌లో (Kalki 2) భాగస్వామి కాలేకపోయింది. గొప్ప టీమ్‌తో కల్కి సీక్వెల్ మీ ముందుకు వస్తుంది. భవిష్యత్తులో దీపిక మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నాం’’ అని వైజయంతీ మూవీస్ పోస్ట్ పెట్టింది
నిర్మాణ సంస్థ ప్రకటనతో అభిమానులు షాక్ అవుతున్నారు. గత కొన్ని రోజులుగా దీపికా పేరు నిత్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి వైదొలగినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ భారీ అప్‌కమింగ్ సినిమా నుంచి ఆమె వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.