Kaantha Trailer : దుల్కర్ నట విశ్వరూపం.. కాంత తెలుగు ట్రైలర్ రిలీజ్

By manavaradhi.com

Published on:

Follow Us
Kantha Telugu Trailer Release

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో చేస్తున్న సినిమా కాంతా. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో నిర్మాత రానా దగ్గుబాటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వేఫారర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా బ్యానర్స్ పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కాంత టీజర్ కు విశేష స్పందన లభించింది. ‘ఊదిపడేయడానికి నేను మట్టిని కాదు.. పర్వతాన్ని..’ అంటూ దుల్కర్‌ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

రిలీజ్ కు మరికొద్ది రోజుల ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ చెన్నైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తాజాగా రిలీజ్ అయిన కాంత ట్రయిలర్ ను గమనిస్తే ఓ దర్శకునికి హీరోకు మధ్య జరిగిన ఇగో వార్ లా కనిపిస్తోంది. దర్శకునిగా సముద్రఖని నటించగా హీరో పాత్రలో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్స్ కనిపించింది. 1950ల కాలంలో మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన నాటకీయ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా దుల్కర్ కెరీర్ లో మరో డిఫ్రెంట్ సినిమాగా నిలిచే ఛాన్స్ ఉంది. అక్కడక్కడా కాస్త మహానటి సినిమా ఫ్లేవర్ కనిపించింది. కానీ ఏమాటకామాట నటచక్రవర్తి DK మహదేవన్ గా దుల్కర్ నటన అదరగొట్టాడు. రానా కూడా అద్భుతంగా నటించాడు. చూస్తుంటే బాగ్యాకు కూడా మంచి రోల్ దొరికినట్టుంది. ఈ నెల 14న తమిళ్, తెలుగు, మలయాళ భాషలలో రిలీజ్ కాబోతుంది కాంత. జానూ చందర్ ఈ చిత్రానికి సంగీతమా అందిస్తున్నాడు.

Leave a Comment