Mana Shankara Varaprasad: వెంకటేశ్ మన శంకర వర ప్రసాద్‌గారు (Mana Shankara Varaprasad garu) చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ఇక అభిమానులు, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ టైం రానే వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్‌గారు (Mana Shankara Varaprasad garu). అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా వస్తుందన్న వార్తతోనే ఫ్యాన్స్ ఉత్సాహంలో మునిగిపోయారు. వెంకటేష్‌తో 100 కోట్ల క్లబ్‌లో చేరిన అనిల్.. ఈసారి చిరుతో మరింత భారీ సక్సెస్ అందుకోవడం ఖాయమని మెగా అభిమానులు నమ్ముతున్నారు.

అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన విక్టరీ వెంకటేష్, ఇప్పుడు చిరు సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ వార్త చాలా రోజులుగా చర్చనీయాంశమవుతున్నా.. వెంకటేష్ షూటింగ్‌లో పాల్గొనకపోవడంతో కొంత అనుమానం నెలకొంది. అయితే ఇప్పుడు ఆ సందేహాలన్నిటికీ చెక్ పెడుతూ వెంకటేష్ అక్టోబర్ 21 నుంచి మెగాస్టార్‌తో కలిసి షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఫన్‌తో పాటు ఎమోషన్ కలబోసిన పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. దీంతో చిరు, వెంకీ కాంబినేషన్ మళ్లీ తెరపై చూడబోతున్న అభిమానులు సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు.










