Ravi Teja: రవితేజ ‘మాస్‌ జాతర’ టీజర్‌ రిలీజ్‌

By manavaradhi.com

Published on:

Follow Us
mass jathara teaser

మాస్ మహారాజ్ రవితేజ నుంచి రానున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’ (Mass Jathara). భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) కథానాయిక. ఆగస్టు 27న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రవితేజ (Ravi Teja) పోలీస్‌ పాత్రలో ‘నాకంటూ ఓ చరిత్ర ఉంది..’ అంటూ మాస్‌ డైలాగులతో అలరిస్తూ కనిపించారు. ఈ మాస్‌ మహారాజ్‌ పంచ్‌లు వేస్తోన్న టీజర్‌ను మీరూ చూసేయండి.

రవితేజ సినిమా అంటే ఏయే అంశాలు ఉంటాయో.. ‘మాస్ జాతర’ టీజర్ అలానే ఉంది. కామెడీ, ఫైట్స్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ మూవీలో రవితేజ.. రైల్వే పోలీస్‌గా కనిపించబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు.. ఈ మూవీతో పరిచయమవుతున్నాడు. నాగవంశీ.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా రవితేజ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి?

Leave a Comment