డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో యూత్‌లో యమా క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఇదే జోష్‌లో బొమ్మరిల్లు భాస్కర్‌తో జాక్ అనే సినిమా చేశాడు. కానీ జనాలకు క్రాక్ తెప్పించే రిజల్ట్ అందుకుంది జాక్. దీంతో.. బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అందుకే.. అర్జెంట్‌గా ఒక హిట్ కొట్టి తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు సిద్ధు.
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కథానాయకుడిగా రూపొందిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘తెలుసు కదా’ (Telusu Kada). రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ అక్టోబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూసిన తర్వాత.. సిద్ధు నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో.. అది సినిమాలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అన్ని ఎక్కువే అన్నట్టుగా ట్రైలర్ కట్ చేశారు. సిద్ధు మార్క్ డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్ బోలెడు ఉన్నట్టుగా చూపించారు. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్ యూత్‌ని ఎట్రాక్ట్ చేసేలా ఉంది.










