పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ . పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ హిట్ట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో ఈ సినిమా ఆ మాత్రం హైప్ ఉంటుంది. పవన్ ప్రస్తుతం ఏపి ఉపముఖ్యమంత్రి బాధ్యతలతో బిజీగా ఉన్నా, షూటింగ్ కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీ లీల, రాశి ఖన్నా ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెండు విభిన్నమైన పాత్రలతో ఇద్దరి కెమిస్ట్రీ స్క్రీన్‌పై హైలైట్ కానుందని టాక్. ఇక ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్, పవన్ డైలాగ్స్, పంచ్‌లు పవర్‌స్టార్ అభిమానులను థియేటర్‌లో పిచ్చెక్కించేలా ఉండబోతున్నాయని యూనిట్ సమాచారం.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ గురించి తాజాగా అప్‌డేట్ బయటకు వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సంగీతం ఇప్పటికే ఫైనల్ అయిపోయిందని తెలుస్తోంది. మొత్తం నాలుగు సాంగ్స్ ఫిక్స్ చేశారు. అయితే ప్రతి పాటకు ప్రత్యేకమైన థీమ్ ఉండబోతోందట. ఒక పాట మాస్ పబ్లిక్ సాంగ్‌గా, మరోటి లవ్ మెలొడీగా, ఒకటి పవన్ ఎంట్రీ సాంగ్‌గా, చివరిది భావోద్వేగ సాంగ్‌గా రూపుదిద్దుకుంటోందని మ్యూజిక్ వర్గాల టాక్. గబ్బర్ సింగ్, జల్సా లాంటి సినిమాలకు ఆయన అందించిన మ్యూజిక్ ఇప్పటికీ హిట్స్ లిస్ట్‌లో నిలిచేలా ఉంది. ఇక ఈసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి డీఎస్పీ కొత్త బీట్‌లు, పవన్ ఎనర్జీకి సరిపోయేలా ప్రత్యేక రిథమ్‌తో పని చేశారట.
మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మ్యూజిక్ అప్‌డేట్ పవన్ అభిమానుల్లో మళ్లీ హై వోల్టేజ్ ఎనర్జీని నింపేసింది. ఫ్యాన్స్ ఇప్పుడు మరోసారి పవర్‌స్టార్ మానియా కోసం కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు.










