Vijay Deverakonda : రౌడీ బాయ్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.
‘రౌడీ జనార్దన్’ పేరుతో ఇది రానుంది. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేశ్ (Keerthy Suresh) నటిస్తున్నారు. నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా (Rowdy Janardhana) ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట షేర్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రవి కిరణ్ కోలా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తొలి మూవీకి భిన్నంగా ఈసారి విజయ్‌తో యాక్షన్‌కు ప్రాధాన్యం ఉన్న కథను తెరకెక్కించనున్నారు. ఈనెల 16 నుంచి ముంబయిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటిసారి విజయ్ సరసన కీర్తి సురేశ్ కనిపించనుండడంతో దీనిపై ఆసక్తి ఏర్పడింది.
ఇక, ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డైరెక్టర్ హను రాఘవపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ ప్రెస్టీజియస్ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.











