Lose Weight : ‘బ్రేక్ ఫాస్ట్‌’ ఈ పద్ధతిలో తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు!

By manavaradhi.com

Published on:

Follow Us

రోజూ అల్పాహారం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే మనం తీసుకునే అల్పాహారం… రోజును ప్రారంభించేందుకు కావలసిన శక్తిని అందిస్తుంది. బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యకరమైన విధానంలో బరువును కాపాడుకునే దిశగా సాయం చేస్తుంది. రాత్రంతా నిద్రపోయి, ఉదయాన్నే లేచిన తర్వాత పొట్టంతా ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో కాస్తంత అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరానికి సాంత్వన లభిస్తుంది. చాలామంది బరువు తగ్గేందుకు ఆహారం తీసుకోవడం మానేస్తారు. తెగ కష్టపడి వ్యాయామాలు చేస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గి.. త్వరగా సన్నబడాలంటే బరువు తగ్గడం ఏమోగానీ కానీ బలహీనంగా తయారవుతున్న వాళ్లు చాలా మంది ఉంటారు. బరువు తగ్గాలనే ఆత్రుతతో కొందరు అల్పాహారం తక్కువగా తీసుకుంటుంటారు. మరీ కొందరు అయితే అసలు ఏకంగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మానేస్తారు.. అయితే అది అసలు మంచి పద్దతికాదు. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి. ఉదయం నుంచి సాయంత్ర వరకూ చేసే పనులకు శక్తినిచ్చేది అల్పాహారమే. దీని వల్ల బరువు, ఆకృతి అదుపులో ఉంటాయి.

బరువు నియంత్రణంలో రోజూ మనం తీసుకునే అల్పాహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే అల్పాహారం మానేయడం వల్ల బరువు తగ్గరు సరికదా, నీరసించి పోవడానికి ఆస్కారం ఉంది. పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు… అల్పాహారం తీసుకునే వారే… తీసుకోని వారి కంటే తక్కువ బరువు కలిగి ఉంటారు. అదే విధంగా ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ద్వారా రోజంతా ఆకలి అదుపులో ఉంటుంది. మధ్యాహ్నం భోజనం విషయంలో తక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా అధిక కేలరీలు శరీరానికి అందకుండా కాపాడుకోవచ్చు. అంతే కాదు రోజంతా మన పని కోసం కావలసిన సామార్థ్యాన్ని పొందవచ్చు. కండరాలు మంచి బలాన్ని ఇస్తుంది.

ఉదయాన్నే అల్పాహారం తీసుకోని వారు మధ్యాహ్నం అధికంగా తినడమో, లేదంటే మధ్యలో ఇతర జంక్ ఫుడ్స్ తీసుకోవడం లాంటివి జరుగుతాయి. ఫలితంగా బరువు పెరగడానికి ఆస్కారం ఉంది. అయితే బరువు నియంత్రణ ఉండాలంటే అల్పాహారంలో ప్రొటీన్ స్థాయి ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల సరైన విధంగా ఆకలి వేసి, సరైన స్థాయిలో మాత్రమే ఆహారాన్ని తీసుకుంటారు. అల్పాహారంగా తృణ ధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకునే వారు… చాలా త్వరగా బరువును అదుపు చేసినట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అరుదుగా అల్పాహారాన్ని తినే వారితో పోలిస్తే, రోజూ తృణ ధాన్యాలతో చేసిన అల్పాహారం తినే వారు బరువు తక్కువగా ఉన్నారని ఇవి చెబుతున్నాయి.

మనం రెగ్యులర్‌గా రోజూ తీసుకొనే బ్రేక్‌ఫాస్ట్‌లో పీచు పదార్థాలు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే పోషకవిలువలున్న ఆహారాలను తీసుకోవడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌లో సమతులాహారం తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి ఉదయం తీసుకొనే బ్రేక్‌ఫాస్ట్‌ ఎంతో అవసరం. బ్రేక్‌ ఫాస్ట్‌ తీసుకోకపోతే,మధ్యాహ్నభోజనంలో ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ తీసుకోవడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. నిద్రించే సమయంలో మన శరీరంలో జీవక్రియల ప్రక్రియ క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి, ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. తిరిగి వేగవంతంగా పుంజుకుంటాయి. ఈ ప్రక్రియల వల్ల శరీరంలో క్యాలరీలు కరుగుతాయి. బరువు అదుపులో ఉంటుంది. బ్రేక్‌ ఫాస్ట్‌ తినకపోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగిపోయి ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అల్పాహారం తీసుకోవడం మాత్రమే కాదు… సరైన విధంగా దీన్ని ఎంచుకోవడం చాలా కీలకం. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, లీన్ ప్రొటీన్ సహా… పలు రకాల ఆహారాలను తీసుకోవచ్చు.

Leave a Comment