ఛాతీలో మంట పుడితే అది గుండెనొప్పి కావచ్చుననే సందేహాలతో సతమతమయ్యే వారూ ఎక్కువగానే ఉన్నారు. కడుపులో ఉండే ఆమ్లాలు అన్నవాహికలోకి వచినప్పుడు కలిగే సమస్యనే మనం ఛాతీలో మంట లేదా అసిడిటీ అంటాం. ఛాతీలో మంటను నివారించడానికి కొన్ని ఆహారాలు బాగా సహాయం చేస్తాయి. అలాగే క్యాల్షియం రిచ్ ఫుడ్స్ కూడా హార్ట్ బర్న్ తగ్గిస్తాయి. మరి హార్ట్ బర్నింగ్ ను తగ్గించే మరికొన్ని ఆహారాలు.
ప్రస్తుత రోజుల్లో వయస్సుతో పనిలేకుండా హఠాత్తుగా వచ్చే అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అందులో గుండెకు సంబంధించిన సమస్యలే అధికం ఉంటున్నాయి . గుండెల్లో మంట అనేక కారణాల వలన కలుగవచ్చు. ఇది ప్రాథమిక నిర్థారణ అదనపు చిహ్నాలు, లక్షణాలమీద ఆధారపడి ఉంటుంది. గుండె మంట వలన వచ్చే చాతీ నొప్పి మండే అనుభూతిని కలిగి ఉంటుంది. బాగా వేయించిన ఆహారాలు అనేక సమస్యలు తెస్తాయి. వాటిలో గుండె మంట ఒకటి. తరచుగా వేపుడు ఆహారాలు తింటే ఛాతీలో కిందిభాగంలో మంట వస్తుంది. అది పొట్టకు కూడా వ్యాపిస్తుంది. దీనినే గుండెమంట అంటారు.
గుండె మంట తరచుగా వస్తూంటే, సమస్యలు ఎక్కువవుతాయి. అటువంటి సమస్యలు రాకుండా వేపుడు ఆహారాలు తగ్గించి, ఉడికించిన ఆహారం తినాలి. ఇది సాధారణంగా రాత్రి భోజనం తరువాత వస్తూ వుంటుంది. ఈ మంట పడుకున్నప్పుడు కానీ, వంగినప్పుడు కానీ ఎక్కువవుతుంది. ఇది గర్భవతి మహిళలలో కూడా సాధారణంగా వస్తూంటుంది. ఇది ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడంవలన, లేదా కొన్ని మసాలాలు, అధిక క్రొవ్వు శాతం లేదా అధిక ఆమ్ల శాతం కల ప్రత్యేక ఆహారపదార్థాలను తీసుకోవడంవలన కూడా వస్తుంది.
గుండె మంట సమస్యతో ఉన్నవారు ఆహారం తీసుకున్న తర్వాత చాలా సమయం వరకు ఛాతీలో మంటగా ఉంటుంది. పుల్లటి త్రేన్పులు ఎక్కువగా వస్తుంటాయి.గొంతులో అసౌకర్యంగా ఉంటుంది. అసిడిటీతో కాని ఆసిడ్ దీనికోసం కంగారుపడి డాక్టరు దగ్గరకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే అందుబాటులో ఉండే ఆహారాలతోనే ఛాతిలో మంటను తగ్గించుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది. గుండె మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
పెరుగు క్యాల్షియం రిచ్ ఫుడ్. ఇది ఛాతీలో మంటను తగ్గించి, తిన్న ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. బొప్పాయిలో ప్రోటియోలిక్ ఎంజైమ్ ఉంటుంది..ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మనం తీసుకొనే ఆహారంలోని ప్రోటీనులను జీర్ణం చేయడానికి బొప్పాయిని తీసుకోవాలి. ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు ఆరెంజ్ జ్యూస్ చక్కగా సహాయపడుతుంది. ఆరెంజ్ లో అసిటిక్ ఆమ్లం అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. దాంతో ఛాతీలో మంటను తగ్గిస్తుంది.
గుండె మంటతో బాధపడుతున్నవారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ?
గుండె మంటను తగ్గించడానికి పండ్లు కూడా ఎంతో దోహాదపడతాయి. అరటిపండులో అధికంగా పొటాషియంతో పాటు నేచురల్ ఆంటాసిడ్స్ ఉండి గుండె మంటను నుండి ఉపశమన పొందడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణకోశం శుభ్రపరచడానికి మరియు మలబద్ధకం నివారికి బాగా సహయపడుతుంది. ఆపిల్స్ లో ఫినోలిక్ ఫైటోకెమికల్స్, కార్బోహైడ్రేట్స్ వంటివి హార్ట్ బర్న్ ను ముఖ్యంగా పొత్తి కడుపు పైభాగంలో మంటను తగ్గిస్తాయి.
సిట్రస్ పండ్లలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది గుండెలో మంటను తగ్గిస్తుంది. అంతే కాదు నిమ్మకాయ, గ్యాస్ట్రిక్ సమస్యను మరియు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. సీఫుడ్స్ ముఖ్యంగా చేపల్లో టోరిన్ అధికంగా ఉండి గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని తగ్గిస్తుంది. బ్రకోలీ తింటే కడుపులో మంట, ఎసిడిటీ నుంచి త్వరితగతిని ఉపశమనం పొందవచ్చు. బాదంపప్పు గుండెలో మంటను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలా అని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
అసిడిటీ తగ్గటానికి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోజు వాటిని వాడటం వలన వేరే ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకని సహజంగా ఛాతీలో మంటని తగ్గించుకోవటంపై దృష్టిసారించడం చాలా మంచిది.