Thyroid Diet: ఈ ఆహారం తింటే.. థైరాయిడ్‌ నార్మల్‌ అవుతుంది..!

By manavaradhi.com

Published on:

Follow Us
Foods that help or hurt yourThyro

ప్రపంచ వ్యాప్తంగా నేడు చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు కచ్చితమైన ఆహారం తీసుకుంటే దాన్నించి బయట పడవచ్చు. మనం తీసుకునే ఆహారం మెటబాలిజంను ప్రభావితం చేస్తుంది. కనుక అలాంటి ఆహారం తింటే తద్వారా థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి..?

మన గొంతు దగ్గర మన గాలి గొట్టానికి సీతాకోక చిలుక ఆకారంలో ఆనుకుని ఉండేదాన్ని థైరాయిడ్‌ గ్రంథి అంటారు. శరీరం మొత్తం దీని కంట్రోల్ లో ఉంటుంది. దీని బాధ్యత కాస్త పెద్దదే. ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్ల ద్వారానే శరీరానికి చురుకుదనం వస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయాలంటే అయోడిన్ తప్పనిసరి. అయితే చాలా మంది అధికంగా ఉప్పు తీసుకుంటూ ఉంటారు. దానిలో అయోడిన్ స్థాయి సరైన మోతాదులో లేకపోతే, ఉప్పు వల్ల ఇతర సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.

సాధారణంగా చేపలు, పాల ఉత్పత్తులు ద్వారా కూడా ఇది లభిస్తుంది. పాలకూర మొదలుకుని చాలా ఆకుకూరల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అన్ని రకాల ఖనిజాలు శరీర క్రియల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే థైరాయిడ్ ఉన్నవారు అధిక ఖనిజ లవణాల కోసం ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఉండే ఫైబర్ కూడా శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

చేపల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సెలీనియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ LDL కొలెస్ట్రాల్స్ ను తగ్గిచేందుకు ఉపయోగపడతాయి. అలాగే సెలీనియం థైరాయిడ్ హార్మోన్స్ ను పెంచేందుకు తోడ్పడుతుంది. సాల్మొన్, సార్డైన్, ట్యూనా వంటి సముద్రపు చేపలను ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి.

తాజా ఆకుకూరలు, కూరగాయాలు, పండ్లలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్స్, ఆమ్లజనకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వారిని వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. ఫ్యాట్ తక్కువగా ఉండే పాలు, యోగార్ట్, చీజ్ వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో అయోడిన్, సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇందులోని అమైనో యాసిడ్ టైరోసిన్ హైపో థైరాడిజంపై బాగా పోరాడుతాయి. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను ఇవి పెంచుతాయి.

గుడ్లలోనూ అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ ను తగ్గించేందుకు ఇవి చాలా మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే గుడ్డులోని పచ్చసొన తినకుండా ఉండడం మంచిది. లేదంటే గుడ్డు మొత్తాన్ని తినొచ్చు. ఆలివ్ నూనెతో చేసిన ఆహారాలు తీసుకుంటే మంచిది. థైరాయిడ్ హార్మోన్ స్థాయిల ను పెంచడానికి ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులను పెంచడానికి ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆలివ్ నూనె శరీరంలోని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్స్ ను తగ్గిస్తుంది.

బ్రెజిల్ నట్స్ లో మినరల్స్, సెలీనియం ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్స్ బాగా విడుదల కావడానికి ఇవి ఉపయోగపడతాయి. బ్రెజిల్ నట్స్ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను మెరుగుపరుస్తుందని పలువురు పరిశోధనల్లోనూ తేలింది. ఇందులోని సెలీనియం వాపును తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అవిసె గింజల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే జింక్, సెలీనియం, అయోడిన్ కూడా ఎక్కువగా ఉంటాయి. నీరు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. దీంతో మీరు హైడ్రేటెడ్ గా ఉంటారు. మీ శరీరంలోని మలినాలు మొత్తం బయటకు వెళ్తాయి.

బాడీకి రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు అవసరం. అందువల్ల నీరును అధికంగా తీసుకుంటూ ఉండాలి. నూనెలో ఫ్రై చేసిన ఆహారాలు లేదా రెసిపీలు శరీరంలో కొవ్వు పదార్థాలను మరియు బరువును పెంచుతాయి. ఈ రెండు పరిస్థితులు కూడా థైరాయిడ్ వ్యాధి గ్రస్తులకు చాలా ప్రమాదకరం. కావున, ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. మానసిక పరిస్థితిని, నిద్ర, థైరాయిడ్ విధి మరియు థైరాయిడ్ మందులను ఆల్కహాల్ ప్రభావితపరుస్తుంది. ఆల్కహాల్ ద్రావణాలకు దూరంగా ఉండటం వలన థైరాయిడ్ విధి సజావుగా జరపబడుతుంది. … పోషకాహారం సరిగ్గా తీసుకుంటూ, వైద్య సలహాలు పాటిస్తే.. థైరాయిడ్ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.

Leave a Comment