Pulses : మనకు పోషకాలనందించే పప్పు దినుసులు

By manavaradhi.com

Published on:

Follow Us
Pulses

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి పోషకాలు కచ్చితంగా అవసరం. ముఖ్యంగా మాంసాహారం తీసుకోనివారికి ప్రొటీన్లు అందించే ప్రధాన ఆహారం పప్పు దినుసులు. వీటి నుంచి ప్రొటీన్లు మాత్రమే కాదు.. ఇతర పోషకాలు ఎన్నో అందుతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే గుండె వ్యాధులు, క్యాన్సర్లతో పాటు టైప్‌-2 డయాబెటిస్‌ వంటివీ అదుపులో ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.

చాలా రకాలుగా మనం పప్పు దినుసులను వంటకాలలో ఉపయోగిస్తున్నాం. ఇవి చాలా రుచిగా ఉండటమేకాక మంచి పోషణను కలిగి ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కూరగాయలు లేకున్నా పప్పుదినుసులతో కూరలు చేసుకోవచ్చు. మనకు కందిపప్పు, పెసరపప్పు, మినపపప్పు వంటి పలురకాల దినుసులు అందుబాటులో ఉన్నాయి. పప్పులే కదా అని తేలికగా తీసిపారేయకండి. వీటి వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

మన తరచూ తినే పప్పుల్లో కూడా విటమిన్స్‌ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పప్పు దినుసుల్లో ఫైబర్‌, ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేసేలా ఉపయోగపడతాయి. అలాగే కొత్త కణాలు పునరుత్పత్తి కావడంలో సహాయపడతాయి. పప్పు దినుసుల్లో విటమిన్‌ ఏ, విటమిన్‌ బీ, విటమిన్‌ సీ, విటమిన్‌ ఈ, మెగ్నిషియం, ఐరన్‌, జింక్‌ కూడా లభిస్తాయి.

నోటికి రుచినే కాదు, పొట్టకు పోషకాలు అందించడంలోనూ పప్పులదే పైచేయి. రోజువారీ ఆహారంలో పప్పును తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ప్రతిరోజూ పప్పు దినుసులను ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుముఖం పడుతుంది. పప్పుల్లో అధిక మోతాదులో ఉండే ఫొలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు గుండెను పదిలంగా ఉంచుతాయని అధ్యయనాలలో తేలింది. హైబీపీ త‌గ్గుతుంది. వాపులు త‌గ్గుతాయి.

డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని నిత్యం తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. శ‌ర‌రీంలో ఫ్రీ ర్యాడిక‌ల్స్ ఉండ‌వు. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. టైప్ 2 డ‌యాబెటిస్ రాకుండా ఉంటుంది. పప్పు దినుసుల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మలబద్దకంతో బాధపడేవారికి పప్పు దివ్యాఔషధం. డైయేరియా వచ్చిన వాళ్లు పప్పు తింటే త్వరగా నయం అవుతుంది. స్థూలకాయంతో బాధపడేవారు కూడా పప్పులను తినవచ్చు.

నం పప్పు పదర్థాలు తీసుకున్నప్పుడు అందులోని పోషకాలను ముందు చిన్న పేగులు గ్రహించిన తర్వాత జీర్ణం కాని పిండి పదర్థాలు పెద్ద పేగుగు చేరుకుంటాయి. అక్కడున్న బ్యాక్టీరియాలు పులిసిపోయేలా చేసి కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. పప్పులో దినుసుల్లో ప్రోటీన్లు, అధికంగా ఉంటాయి. ఓ కప్పు ఉడకబెట్టిన పప్పులో రోజుకు సరిపడా ఫైబర్ లభిస్తుంది. పప్పు దినుసుల్లో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. మాంసాహారానికి దూరంగా ఉండేవారికి ప్రోటీన్లు పరిపూర్ణంగా అందవు అలాంటివారు.. ప్రొటీన్ల కోసం పప్పును తీసుకోవాలి. పప్పుల్లో ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. వీటిలోని పోషకాలు మంచి బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. జీర్ణాశయ క్యాన్సర్, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలను తగ్గిస్తాయి అనడంలో ఎలాంటి సందేహాంలేదు.

పప్పు దినుసుల్లో కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ – ఎ , జింక్ ఉంటాయి. కాబట్టి కంటిచూపు మెరుగతుంది. ముఖ్యంగా రేచీకటితో బాధపడేవారు .. పప్పు దినుసులను ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చు. పప్పు దినుసులు వండేటప్పుడు శుభ్రంగా కడగాలి. ముందుగానే కాసేపు నానబెట్టడం చాలా మంచిది. మనం పూర్తిస్థాయిలో వీటి నుంచి ప్రయోజనాలు పొందాలంటే వండే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తేనే అవి సాధ్యమంటున్నారు ఆహార నిపుణులు.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వులు, ఖనిజాలు, మినరల్స్ సమృద్దిగా ఉండాలి. ఇవన్నీ కూరగాయల ద్వారా ఎక్కువగా లభిస్తాయి. వీటి తర్వాత పప్పులలో మాత్రమే ఇది దొరుకుతాయి. అందుకే ప్రతి రోజు ఏదో ఒక పప్పు కర్రీ ఆహారంలో ఉండేవిధంగా చూసుకోవాలి.

Leave a Comment