Benefits Seeds : నేటి నుంచి సీడ్స్ ను మీ ఆహారంలో భాగం చేసుకోండి

By manavaradhi.com

Updated on:

Follow Us
Fiber Rich Diet:

గుమ్మడి, అవిసెలు, సబ్జ, నువ్వులు ఇవ్వన్ని గింజలు కింద‌కు వ‌స్తాయి. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. రుచి మాత్రమే కాదు, అద్భుతమైన న్యూట్రీషియన్స్ కూడా ఉంటాయి. వీటిని రోజూ గుప్పెడు తినడం వల్ల అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చంటున్నారు ప‌రిశోధ‌కులు. వీటిని తీసుకోవ‌డం ద్వారా విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ కావాల్సినంత మోతాదులో శ‌రీరానికి అందుతాయి. రోజుకు క‌నీసం 10 గ్రాముల‌కు త‌క్కువ కాకుండా తిన్న‌ట్ట‌యితే శ‌రీరానికి అవ‌స‌ర‌మైన మేర పోష‌కాలన్నీ అందుతాయ‌న్న‌మాట‌. ఏవైనా ఒకే ర‌కం గింజలు కాకుండా అన్ని ర‌కాలు క‌లిపి తీసుకోవ‌డం మ‌రింత మంచిది. దానిమ్మ గింజలలో వివిధ విటమిన్లు అయిన విటమిన్ బి, సి మరియు కె, ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.దానిమ్మ గింజలు కీళ్లవాతాన్ని మరియు ఆర్థరైటిస్ జబ్బును నయం చేస్తాయి. ఎందుకంటే వీటిల్లో ఫ్లేవనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గించటానికి పనిచేస్తాయి.దానిమ్మ గింజల వలన ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ నివారించబడుతుంది.

ఎటువంటి గింజలు మనం నిత్యం తీసుకోవాలి ?
రోజూ చారెడు అవిసె గింజలు తింటే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అవిసె గింజల్లో పుష్కలంగా ఉండే ఫైబర్, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్ ను మెరుగుపరుస్తుంది. రోజూ చారెడు అవిసె గింజలు నమిలితే బరువు అదుపులో ఉంటుంది. పైగా ఊబకాయం సమస్యతో బాధపడేవారు అధిక బరువు తగ్గుతారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలతో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. వీటిలో విటమిన్ సి… గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇక విటమిన్ ఈ… ఫ్రీ రాడికల్స్ నుంచీ కాపాడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా అడ్డుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. రోజూ ఓ పావు కప్పు గింజలు తింటే మనకు కావాల్సిన విటమిన్ Eలో 90 శాతం లభించినట్లే. వీటిలో ఫైబర్… కొలెస్ట్రాల్ తగ్గేందుకు సహకరిస్తుంది. ఈ సీడ్స్‌లో డైటరీ ఫైబర్ మల బద్ధకాన్ని నివారిస్తుంది. ఈ విత్తనాల్లోని మెగ్నీషియం… ఎముకలు గట్టిపడేందుకు ఉపయోగపడుతుంది. ఎముకల జాయింట్లు బాగా పనిచేసేలా ఈ గింజల్లోని కాపర్ సహకరిస్తుంది.

సన్ ఫ్లవర్ విత్తనాల్లోని మెగ్నీషియం మన నరాలకు రిలాక్స్ ఇస్తుంది. ఈ విత్తనాల్లోని రాగి… మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాపర్ మన శరీరానికి కావాల్సిన మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముసలితనం రాకుండా చెయ్యడంలో ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి. నువ్వుల్లోని అమైనో ఆమ్లాలు, మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నువ్వులు వాడకం వల్ల రక్తపోటు, చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అనీమియా వంటి రక్త సంబంధిత సమస్యలకు నల్ల నువ్వుల వినియోగం చక్కని పరిష్కారం. నువ్వుల్లోని ‘సేసామిన్‌’ అనే యాంటీ ఆక్సిడెంట్‌ కండరాల నొప్పులు, వాపుల నివారణకు, గుండె సంబంధిత అనారోగ్యాల నివారణకు దోహద పడుతుంది. నువ్వుల వినియోగంతో ఆస్తమా తదితర శ్వాసకోస సమస్యలు ఉపశమిస్తాయి.

విత్తనాలను ఆహారంలో భాగంచేసుకుంటే ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి ?

పుచ్చ‌కాయ‌ను తింటే దాంతో మ‌న‌కు ఎన్ని ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అయితే కేవ‌లం పుచ్చ‌కాయ మాత్ర‌మే కాదు, అందులో ఉండే గింజ‌లు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌మే. పుచ్చ‌కాయ విత్త‌నాల్లో అనేక ర‌కాల ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్ ఉంటాయి. పుచ్చ‌కాయ విత్త‌నాల్లో ఫైబ‌ర్ కూడా ఎక్కువే. ఇది జీర్ణ సంబంధ స‌మ‌స్య‌ల‌ను తొల‌గిస్తుంది. జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయి. లివ‌ర్ వ్యాధులు, వాపుల‌తో బాధ‌ప‌డే వారికి పుచ్చ‌కాయ విత్త‌నాలు చ‌క్క‌ని ఔష‌ధంగా ప‌నిచేస్తాయి. డ‌యాబెటిస్ ఉన్న వారికి పుచ్చ‌కాయ విత్త‌నాలు మేలు చేస్తాయి. ఇవి వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను అదుపు చేస్తాయి. దీంతో మ‌ధుమేహం నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

జిగురులా ఉండే ఈ సబ్జ గింజల్లో ఔషధగుణాలు బోలెడు ఉంటాయి. ఈ విత్తనాలకు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది.. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపునిండిన భావన కలిగి మాటిమాటికీ ఆకలేయదు. రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ చక్కగా పనిచేస్తాయి. క్రీడాకారులకు ఈ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే ఈ విత్తనాలను రోజూ తీసుకుంటే శరీరంలో తేమను పోనీకుండా నిలిపి ఉంచుతాయి.

గుమ్మడివిత్తనాల్లో ఉన్న పోషక విలువలు మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. గుమ్మడి గింజల్లో కాపర్ శాతం అధికం. ఇవి ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. సోడియం శాతం తగ్గి బీపీ కంట్రోల్ లో వస్తుంది. గుమ్మడికాయ గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు అజీర్ణం నివారించడంలో కూడా సహాయం చేస్తాయి. గింజల్లో ఫైబర్ నిక్షేపాలు అధికంగా ఉంటాయి, కనుక వాటిని అదే పనిగా తినడం మూలంగా గ్యాస్ మరియు ఉబ్బర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కావున, ఎట్టి పరిస్థితుల్లో పరిమితికి మించి తీసుకోకూడదు.

వీటి టేస్ట్ ఎంతో మందికి నచ్చుతోంది. కేలరీలతోపాటూ… ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ మన ఆరోగ్యాన్ని పెంచుతున్నాయి. కాబట్టి మీరుకూడా నేటి నుంచి సీడ్స్ ను మీ ఆహారంలో భాగం చేసుకోండి … ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుకోండి.

Leave a Comment