Food : వయస్సుకు తగిన ఆహారం! వయసుపైబడుతున్నకొద్దీ తీసుకోకూడని ఆహారాలు ..?

By manavaradhi.com

Published on:

Follow Us
Foods as You Age

మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావటం. జీర్ణవ్యవస్థ సవ్యంగా పనిచేయాలంటే మనం దాన్ని పట్టించుకోవాలి. వయసులో ఉన్నపుడు చక్కగా జీర్ణమై ఒంటికి పట్టిన ఆహారం….వయసుపైబడుతున్న కొద్దీ ఇబ్బంది పెట్టవచ్చు. వయసు పెరుగుతున్నదశలో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే…అజీర్తి, గ్యాస్ సమస్యలు, కడుపు ఉబ్బరం, నిద్రపట్టకపోవటం…లాంటివేమీ లేకుండా హాయిగా ఉండవచ్చు.

ఒక్కోవ్యక్తికి ఒక్కో రకంగా పౌష్టికాహారం అవసరమౌతుంది అలాగే వయసుపైబడుతున్నకొద్దీ తీసుకోనే ఆహారాల విషయంలో తగిన జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. ఇలా చేస్తే మన శరీరంలో జీవక్రీయలన్ని సక్రమంగా జరుగుతాయి. వయసు పెరుగుతున్నపుడు తప్పకుండా జీర్ణక్రియపై భారం మోపని, ఆరోగ్యానికి ఇబ్బంది పెట్టని ఆహారాన్ని తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు మనం తీసుకునే మందులపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఏ ఆహారాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకుని ఉండటం మంచిది.

అధిక రక్తపోటు, ఆందోళన, నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు ద్రాక్షపళ్ల రసం తీసుకోకూడదు. దీని బదులుగా సి విటమిన్ ఉన్న కమలా, నిమ్మ పళ్లను వాడవచ్చు. ప్యాకెట్లలో దొరికే పళ్లరసాలు తీసుకునేటప్పుడు కూడా అందులో ద్రాక్ష రసం కలిసిందా లేదా అని సరిచూసుకోవలి. పంటినొప్పి, పళ్లు జివ్వుమని లాగటం లాంటి సమస్యలు ఉంటే పచ్చి కూరగాయలు తినకూడదు. వీటిలో ఉన్న పీచు విటమిన్లు అందాలంటే వాటిని మెత్తబడే వరకు ఉడికించి తీసుకోవాలి.

క్యారెట్లు, గుమ్మడి, బీట్రూట్ లాంటి వాటిని సూప్లుగా తీసుకోవచ్చు. మధుమేహం ఉన్నవారిలో ఆల్కహాల్ రక్తంలో చక్కెరశాతాన్ని పెంచుతుంది. అంతేకాదు అనారోగ్య సమస్యలకు వాడే మందుల పనితీరుని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే వయసుమీరుతున్నపుడు ఆల్కహాల్ వినియోగం గురించి తప్పకుండా డాక్టరు సలహాని తీసుకోవాలి.చుకోవాలి. వయసులో ఉన్నపుడు చక్కగా జీర్ణమై ఒంటికి పట్టిన ఆహారం….వయసుపైబడుతున్న కొద్దీ ఇబ్బంది పెట్టవచ్చు. వయసు పెరుగుతున్నదశలో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే…అజీర్తి, గ్యాస్ సమస్యలు, కడుపు ఉబ్బరం, నిద్రపట్టకపోవటం…లాంటివేమీ లేకుండా హాయిగా ఉండవచ్చు.

వయసు పెరుగుతున్న దశలో… కొంతమంది గ్యాస్ పెరుగుతుందనే ఉద్దేశ్యంతో క్యాబేజి క్యాలిఫ్లవర్ లాంటి వాటిని తగ్గించి తింటారు. అయితే వీటిలో సి విటమిన్, క్యాల్షియం, పీచు, ఇనుము, ఫొలేట్ అనే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహారాలు క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వీటిని తక్కువ మోతాదుల్లో తీసుకుంటూ ఉండాలి. కొంతమంది కడుపునొప్పి గ్యాస్ సమస్యలు వస్తాయనే భయంతో బీన్స్ కూడా తినరు. ఇందులో పీచు, ప్రొటీన్లు, ఇనుము చాలా ఎక్కువ మోతాదులోనూ, కొవ్వు చాలా తక్కువగానూ ఉంటాయి. అందుకే పోషకాలు ఉన్న బీన్స్ ని పూర్తిగా మానేయకుండా తక్కువ మోతాదుల్లో తీసుకోవచ్చు.

తాజా పళ్లలో మనకు పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. అయితే వయసు పెరుగుతున్నపుడు కొన్ని పళ్లను నమిలి తినటం శ్రమగా అనిపిస్తుంది. ఇలాంటివారు తేలిగ్గా తినగల అరటి, పుచ్చకాయ, ద్రాక్ష వంటివాటిని తినవచ్చు. యాభై ఏళ్లు దాటాక ఉప్పు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉప్పు ఎక్కువగా తినే అలవాటు ఉన్నవారు దీనిని తగ్గించడం మంచిది. ఈ వయసులో రోజుకి రెండువేల మూడు వందల మిల్లీగ్రాముల ఉప్పుని మాత్రమే తీసుకోవాలి. అంటే ఒక టీస్పూను అనుకోవచ్చు.

ఇక బిపి, షుగర్ లాంటి సమస్యలు కూడా ఉంటే 1500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉప్పుని వాడకూడదు. మరీ ఎక్కువ ఉప్పు తీసుకునే వారిలో బిపి పెరిగి గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్యాక్‌ చేసిన బయటి ఆహారాన్ని కొంటున్నప్పుడు తప్పనిసరిగా వెనక భాగంలో ఉండే వివరాలను చదవాలి. దానిలో ఉండే కెలోరీలు, కొవ్వు, ఉప్పు శాతం ఎంతున్నాయో చూసుకోవడం మంచిది.

సోడా, ఇతర కార్బొనేటెడ్ డ్రింక్స్‌లో కెఫీన్ ఉంటుంది. దీంతోపాటు వీటిలో ఉండే ఎయిర్ బబుల్స్ జీర్ణాశయంలోకి వెళ్లి దాన్ని సాగదీసే పనిచేస్తాయి. అందువల్ల పొట్ట ఉబ్బుతుంది. ఫలితంగా గ్యాస్, అసిడిటీ వస్తాయి. కనుక వీటిని తీసుకోవడం కూడా మానేయాల్సి ఉంటుంది. పాలు మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. అయితే వయసు మీద పడుతున్నపుడు పాలు కానీ పాల నుండి తయారయ్యే ఇతర పదార్థాలు కానీ సమస్యలకు కారణం కావచ్చు. కానీ వీటి ద్వారానే మనకు క్యాల్షియం , ప్రొటీన్లు అందుతాయి కనుక వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి.

కొవ్వులేని పాలతో తయారైన పాలు, పెరుగు, జున్ను వంటి వాటిని పొట్టకి అసౌకర్యం కలగనీయని స్థాయిలో వాడుకోవచ్చు. గుండె సమస్యలున్నవారు కాఫీని మానేయడమే మంచిది. అయితే ఒక్కసారిగా కాకుండా నిదానంగా మానుతూ హెర్బల్ టీ ని అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యానికి మేలు చేసే మొలకెత్తిన గింజల వలన కూడా వయసు మీరిన వారికి సమస్యలు రావచ్చు. అలాంటివారు వీటిని ఉడికించి తీసుకోవటం మంచిది.

పోషకాలు ఉన్న ఆహారమే అయినా వయసు మీద పడుతున్నపుడు కొన్ని రకాల సమస్యలు తెచ్చిపెట్టవచ్చని గుర్తుంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకున్నా ఎలా తీసుకోవాలన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడే ఆహారం శరీరానికి మేలు చేస్తుంది.

చిన్ననాటి నుంచే ఆహారపు అలవాట్లు ఒక క్రమపద్ధతిలో ఉంటే అది మన చక్కని పునాదిగా ఉపయోగపడుతుంది. శరీరానికి అందాల్సిన పోషకాలు, విటమిన్లు సమపాళ్లలో అందించిన‌ప్పుడు మ‌నం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటామ‌ని సెల‌విస్తున్నారు పోష‌కాహార నిపుణులు.

Leave a Comment