కుటుంబంలో అందరికి కావల్సిన ఆహారం అందిస్తూ.. కుటుంబసభ్యులంతా ఆరోగ్యంగా ఉండేలా అనుక్షణం తపించే మహిళలు తమ ఆరోగ్యాని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. మహిళల ఆరోగ్యము వారు తీసుకునే పౌష్టికాహారంపై ఆధారపడి ఉంటుంది. ఇంతకీ మహిళలు ఎటువంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి? మహిళలు తినాల్సిన ఆహారాలేంటి..?
చాలా మంది మహిళలు పనిలో పడి తమ ఆరోగ్యాన్ని, ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా వేళకు సరైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి అవసరం అని గుర్తుంచుకోవాలి. రోజువారిగా తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, పిండిపదార్థాలు, విటమిన్స్, మినరల్స్ తప్పక ఉండాల్సిందే. పసుపు, ఎరుపు రంగులో ఉండే పండ్లు , కూరగాయల్లో కెరొటినాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. మహిళలు కెరొటినాయిడ్స్ ఉండే పదార్థాలను ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. మహిళలు వీటిని తీసుకుంటే రొమ్ము,గర్భశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. చేపలు మహిళలల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఒమేగా 3ఫ్యాటీ ఆమ్లాలు డిప్రెషన్ నుంచి గుండెజబ్బుల దాకా అన్నింటినీ నివారిస్తాయి.
మహిళల్లో హార్మన్ల ప్రభావం వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువ. ఇవి వాటికి మంచి మందులా పనిచేస్తాయి. టొమాటోలు కూడా మహిళల ఆరోగ్యం కొసం చక్కగా పనిచేస్తాయి. ఇందులో ఉండే లైకోపీన్ రొమ్ముక్యాన్సర్ ను నివారిస్తుంది. మరియు చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ B కాలీప్లవర్ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. గర్బిణీ స్త్రీలయితే ఖచ్చితంగా కాలిఫ్లవర్ తీస్కోగలిగితే వాళ్లకు డెలివరీ టైమ్ లో కావలసిన శక్తి లభిస్తుంది. Aవిటమిన్ పుష్కలంగా ఉండే క్యారెట్ చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. అంతే కాదు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడే స్త్రీలు క్యారెట్ ను ఎక్కువగా తీసుకొంటే మంచిది.
పురుషుల కంటే మహిళలకు ఎక్కువ కాల్షియం అవసరమౌతుంది. క్యాల్షియం లోపం ఎముకల మీద ఆధారపడిన జీవక్రియలను దెబ్బతీయటంతోపాటు మెనోపాజ్దశలోని ఉన్న మహిళల్లో పలు ఇతర ఇబ్బందులకు కారణం అయ్యే ప్రమాదం ఉంది. క్యాల్షియం ఉన్న ఆహారాలు తీసుకోవాలి. పాలు, పాల పదార్ధాల్లో క్యాల్షియం పాళ్లు ఎక్కువగా ఉంటాయి. బిపి నుంచి మధుమేహం వరకు ఓట్స్ మంచి మందులాగా పనిచేస్తాయి. ముఖ్యంగా గర్భణి స్త్రీలకు మరింత మేలు చేస్తాయి. గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల పుట్టే శిశువుకు జన్యులోపాలు కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. తోటకూరలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీనిలోని మెగ్నీషియం ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ సమస్యను తగ్గిస్తుంది.
నారింజ, ద్రాక్ష పండ్లను తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే స్త్రీలు తాము తీసుకునే ఆహారంలో విటమిన్లు లోపం లేకుండా చూసుకోవాలి. శరీరానికి తక్షణ శక్తి కోసం పిండిపదార్ధాలు అవసరం. ఇవి తీసుకున్న ఆహారాన్ని గ్లూకోజ్ రూపంలో శక్తిగా మారుస్తాయి. కాబట్టి ప్రతిరోజూ తినే ఆహారంలో పిండిపదార్ధాలు ఉండేలా చూసుకోవాలి. బంగాళదుంపలు, చిలగడదుంప లాంటి వాటిలో పిండిపదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణం అయ్యి శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. దీనివలన మలబద్ధకం లాంటి సమస్యలు కూడా రావు.
ఆడవారు ఆహారాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
- ఆడవారికి నిత్యం 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. ఐరన్ లోపిస్తే.. రక్తహీనత సమస్య మాత్రమే కాదు, పలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మనకు ఐరన్ అనేక కూరగాయలతోపాటు మాంసాహారంలోనూ లభిస్తుంది.
- టమాటాలు, పాలకూర, మునగాకు, గుమ్మడికాయ విత్తనాలు, నట్స్, కోడిగుడ్లు, సోయా, జీడిపప్పు, మటన్, మటన్ లివర్, రొయ్యలు వంటి ఆహారాల్లో మనకు ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.
- అలాగా ఉదయం నిద్రలేచిని తర్వాత తప్పని సరిగా అల్పాహారం తీసుకోవాలి. అందులో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. రోజూ ఒకటే తరహా ఆహారం కాకుండా పోషక విలువలు ఉన్న రకరకాలైన ఆహారాలను తీసుకోవాలి.
సాద్యమైనంతవరకు జంక్ పుడ్స్ తీసుకోవడం తగ్గించాలి.ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. రెండు మూడు రోజులు ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఆహారం ఒకేసారి కాకుండా ప్రతి మూడు గంటలకు ఒక సారి కొంచెం.. కొంచెంగా తీసుకోవడం ఉత్తమం. మహిళలు సమతుల్యహారం తీసుకున్నప్పుడే కుటుంబం సంతోషంతో ఉంటుంది. ఈ ఆహారాలు తీసుకుంటూనే క్యాలరీలు ఖర్చు చేసేందుకు శ్రమపడడం తప్పనిసరి. లేనిపక్షంలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.