వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఈ మధ్యకాలంలో శ్వాస సంబంధ సమస్యలు సర్వ సాధారణంగా మారాయి. చలి కాలం కావడం వల్ల ఇవి మరింత ఎక్కువగా ఎదురౌతూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయట పడేందుకు బెర్రీలు, ద్రాక్ష పండ్లు తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పండ్లు తినడం ద్వారా శ్వాస సంబంధ సమస్యల నుంచి బయట పడవచ్చా, శ్వాసకు, పండ్లకు సంబంధమేంటో తెలుసుకుందామా.
చలికాలం మొదలైందంటే చాలు ఎక్కువ మంది చెప్పే సమస్య శ్వాసలో వచ్చే ఇబ్బందులు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా, ఏ చేసినా సమస్యల తీవ్రతలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. 30 ఏళ్ళ వయసు వరకూ ఊపిరి తిత్తుల్లో వచ్చే సమస్యలు పెద్దగా ఇబ్బందిగా అనిపించవు. వస్తూ పోతూ ఉన్నట్టే ఉంటాయి. కానీ 30 ఏళ్ళు దాటిన తర్వాత అసలు సమస్యలు మొదలౌతాయి. చిన్నతనం నుంచే సమస్యలు ఉన్న వారిలో ఊపిరితిత్తుల పనితీరు క్రమంగా క్షీణించడం మొదలౌతుంది. ఈ పరిస్థితుల్లో ధూమపానం, శారీర శ్రమ, కాలుష్య కారకాలు వెరసి ఊపిరి తిత్తులను మరింత దెబ్బ తీయడం మొదలు పెడతాయి. చాలా మంది ఊపిరి తిత్తుల మీద ఆహారం ప్రభావం గురించి కొన్ని అపోహలు కలిగి ఉంటాయి. తినే ఆహారం పెద్దగా ప్రభావం చూపదు అని భావిస్తుంటారు. నిజానికి ప్రాసెస్ చేసిన మాంసాహారం ఊపిరితిత్తుల మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం ముదురు రంగు పండ్లు, కూరగాయలు పెద్ద మొత్తంలో తిన్న వారికి, మిగిలిన వారితో పోలిస్తే ఊపిరితిత్తుల పనితీరులో క్షీణత నెమ్మదిగా ఉందని రుజువైంది. అయితే అన్ని సమయాల్లో ఆహారం మాత్రమే అన్నింటినీ నిర్ణయించదు అనే విషయాన్ని గుర్తించాలి. ఆహారం కూడా ఇందులో ప్రాధాన్యత వహిస్తుంది.
శ్వాస సంబంధ సమస్యలు తగ్గించుకునేందుకు బెర్రీలు మరియు ద్రాక్ష మంచి ఆహారం అని రుజువైంది. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ శ్వాసలో ఇబ్బందులను తొలగిస్తాయి. వాటిలో ప్రధానంగా లుటీన్ మరియు శ్యక్షనిస్త్ అనే యాంటి ఆక్సిడెంట్లు ఉన్నాయి. అవి ఊపిరితిత్తుల నుంచి కార్సినోజెన్స్ తొలగించి ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. అదే విధంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు తగ్గించడంలోనూ, ఉబ్బసం సమస్యలు ఉన్న వారికి ఇవి చాలా మంచివి. నీలం బెర్రి, రాస్బెర్రి మరియు బ్రాక్ బ్రెర్రీ వంటి ముదురు బెర్రీలు బాగా పని చేస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే వీటిలో ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటాయనేది వైద్యుల మాట. ఊపిరితిత్తుల సమస్యల నుంచి పరిష్కారం కోసం బెర్రీలను తీసుకోవడం ఆరోగ్య పరంగా మంచిదే గాక, ఒక రుచికరమైన మార్గం కూడా. ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినే వ్యక్తులు ఏ వయసులోనైనా సరే సరైన ఊపిరితిత్తుల పనితీరు కలిగి ఉంటారు. ఎరుపు రంగు ద్రాక్ష, బ్లూబెర్రీలతో పాటు ఊదారంగు బంగాళ దుంపలు, కూరగాయాల్లో ఆంథోసనియానిల్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవండ ద్వారా మంచి ఆరోగ్య ప్రభావాలను కలిగి ఉంటారని, ఇదే రకమైన పండ్లను తింటూ ఉండడం ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని వైద్యులు చెబుతున్నారు.
బెర్రీలు ద్రాక్షలు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు, ఊపిరితిత్తుల సంబంధించిన సమస్యలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటాయి. అన్ని రకాల వయసుల వ్యక్తుల మీద ఈ సమస్యకు సంబంధించిన పరిశోధన జరిగింది. ధూమపానం చేయని వ్యక్తులు కావచ్చు, ధూమపానం విడిచిపెట్టిన వ్యక్తులు కావచ్చు ఇద్దరికీ ముదు రంగులో ఉండే పండ్లు కూరగాయలు చాలా సహాయకారిగా ఉంటాయి. వాటిలోనూ ద్రాక్ష, బెర్రీలతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నిజానికి ధూమపానం వల్ల శరీరంలోకి ప్రవేశించే విషాన్ని నిరోధించే క్రమంలో మన శరీరం యాంటీ ఆక్సిడెంట్స్ లేదా యాంటీ ఇన్ ఫ్లేమేటరీల సామర్థ్యాన్ని సైతం దెబ్బ తీస్తుంది. ఈ పరిస్థితుల్లో ధూమపానం విడిచిపెట్టిన వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యలు ఉండి, మందులు వాడుతున్న వారు కూడా నిరభ్యంతరంగా చెర్రీలు మరియు ద్రాక్షలు తీసుకోవచ్చు. అయితే ఊపిరితిత్తుల సమస్య ఎంత మేర ఉందనే విషయం కూడా దీని మీద ప్రభావాన్ని చూపుతుంది. కేవలం వీటిని మాత్రమే తీసుకున్నంత మాత్రాన సమస్యలు పూర్తిగా తగ్గవు అనే విషయాన్ని గుర్తించాలి. సమస్య తీవ్రతను తగ్గించే ఈ ఆహారం తీసుకుంటూ, వైద్యుని పర్యవేక్షణలో సరైన మందులు తీసుకోవడం ద్వారా తొందరగా శ్వాస సంబంధ సమస్యల నుంచి బయట పడవచ్చు.