Food For Eyes : కళ్లను ఆరోగ్యంగా ఉంచే.. ఆహారాలు ఇవే..!

By manavaradhi.com

Published on:

Follow Us

మన ముఖానికి అందాన్ని ఇచ్చేవి కళ్ళు. అటువంటి కళ్ళను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి.శరీరంలో అతి సున్నితమైన భాగం కళ్ళు . కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సరైన విటమిన్, మినిరల్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో కాప్సికమ్ సాయం చేస్తుంది. ఇవి కళ్ళలోని రక్తనాళాలకు మంచిది. కంటిలో శుక్లం పొర ఏర్పడకుండా రక్షణ అందిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాల గింజలు కూడా కంటిని సంరక్షించే అహారాల్లో ఒకటిగా చెప్పుకోవాలి.

విటమిన్ E పుష్కలంగా ఉండే పొద్దుతిరుగుడు గింజలు వయసును తగ్గించే మాక్యులర్ డిజనరేషన్ ను సరైన స్థాయిలో పొందడానకి సాయం చేస్తుంది. ఇది క్యాటరాక్ట్ ను నివారించడంలో కూడా సాయం చేస్తుంది. ముదురు రంగులో ఉండే ఆకుకూరలు తినేవారు కంటి ఆరోగ్యం గురించి, ఇబ్బంది పడాల్సిన పనే ఉండదు. బచ్చలి కూర, కాలే లాంటి వాటిలో విటమిన్ C మరియు E సమృద్ధిగా ఉంటాయి. ఇవి కెరొటినాయిడ్స్ ల్యూటిన్ లాంటిన్ కలిగి ఉంటాయి. కంటికి ఎదురయ్యే అనేక రకాల దీర్ఘవ్యాధులను నియంత్రించే శక్తి వీటికి అధికంగా ఉంటుంది. ఆకుకూరలు అధికంగా తీసుకునే వారికి కంటికి సంబంధించిన వ్యాధులు రావడానికి ఆస్కారం చాలా తక్కువ.

కాలేయం నుంచి రెటీనాకు విటమిన్ A ను అందించడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. లీన్ మరియు కోడి మాంసలో అది ఎక్కువ ఉంటుంది. అన్ని రకాల మాంసాహారాల్లోనూ ఇది అధికంగా ఉండడంతో పాటు, మెలనిన్ పెంచడంలోనూ ఇది సాయం చేస్తుంది. ఫలితంగా కళ్ళకు ఎలాంటి సమస్యలూ రావు. దీర్ఘకాలంలో కంటికి ఇవి మంచి రక్షణను అందిస్తాయి. కోడు గుడ్డు ద్వారా కూడా జింక్ అధికంగా లభిస్తుంది. రెటీనాను దెబ్బతీసే హానికరమైన నీలి కాంతి నుంచి కంటిని కాపాడతాయి. దృష్టిని నియంత్రించే కంటి కేంద్రా భాగానికి కూడా గుడ్లు తినడం ద్వారా రక్షణ లభిస్తుంది.

చిలగడ దుంపల్లోనూ కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. నారింజ రంగులో ఉండే పండ్లు, కూరగాయలు, దుంపలు, క్యారెట్లు, కాంటాలోప్, మామిడి, ఆప్రికాట్స్ వంటి పండ్లలో బీటా కెరోటిన్ తో పాటు విటమిన్ A అధికంగా ఉండడం వల్ల ఇవి రేచీకటి లాంటి సమస్యల నుంచి కంటిని కాపాడడంలో సాయం చేస్తాయి.మాంసాహారం కావచ్చు, శాకాహారం కావచ్చు, కంటి ఆరోగ్యం కోసం ఏది తీసుకుంటున్నామనే విషయం కంటే కూడా, సరైన స్థాయిలో తీసుకుంటున్నామా అనేదే అవసరం. మన పోషణకు తగ్గ స్థాయిలో ఈ ఆహారాన్ని తీసుకుంటూ ఉండడం ద్వారా భవిష్యత్ లో కంటికి ఏ విధమైన సమస్యలూ రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

Leave a Comment