మనలో చాలా మందికి మామిడి పండ్లు అంటే ఎంతో మక్కువ. వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ మామిడి పండ్లు మర్కెట్లోకి ఎప్పుడెప్పుడు వస్తాయా…? అని ఎదురుచూస్తుంటారు. పండ్లలో రారాజుగా పిలిచే మామిడిపండ్లలో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. రోజూ మామిడి పండ్లను తినడం వల్ల శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మామిడి పండ్లు ఎంతగానో దోహదపడతాయి.
మామిడి సీజనల్ ఫ్రూట్.. ఇది చాలా రుచికరమైన పండు. వేసవిలో దొరికే ఈ పండ్లు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. ఈ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నట్లయితే మామిడి పండు మీకు చక్కని పరిష్కారంగా మారుతుంది. మామిడి పండులో డైజెస్టివ్ ఎంజైములు ఉంటాయి. ఇందులో నీటి శాతం, ఫైబర్.. శరీరంలోని అతిసారం, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతాయి.
మామిడి పండ్లలో సరిపడా విటమిన్ – ఏ ఉంటుంది. ఇందులో విటమిన్ – సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు మామిడి పండులో కాపర్, ఫోలేట్, విటమిన్ ఇ, విటమిన్ బి వంటి విటమిన్లు, ఖనిజాలు అదనంగా లభిస్తాయి. వాటి వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మామిడి పండులో విటమిన్ సి, విటమిన్ ఎ ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజూ సరైన మోతాదులో మామిడి పండ్లను తింటే కొద్ది రోజుల్లోనే చర్మపు మచ్చలు మాయమవుతాయి.
పండ్ల రారాజు మామిడి మనల్ని గుండె జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. ఫైబర్, పొటాషియం వాటి వల్ల గుండె నుంచి ప్రవహించే ధమనులలో ఎలాంటి అడ్డంకి లేకుండా కాపాడుతాయి. పాలీఫెనాల్ బయోయాక్టివ్‌గా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.మామిడి పండ్లను తినడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చు. మామిడి తొక్కలో ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది సహజ కొవ్వును కరిగేలా చేస్తుంది. అంటే శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
డైటరీ ఫైబర్ మామిడిలో ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. మీరు అధిక ఫైబర్ పండ్లు లేదా కూరగాయలు తిన్నప్పుడు, ఎక్కువసేపు ఆకలితో ఉండరు. దీని వల్ల అతిగా ఆహారాన్ని తినకుండా ఉండేందుకు మామిడి పండ్లు సహకరిస్తాయి. మామిడి పండ్లు సహజమైన హైపోలిపిడెమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు పొటాషియం యొక్క అద్భుతమైన మూలం. రెండవది, ఇది రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. మామిడి యొక్క ఈ ప్రయోజనాలన్నీ మయోకార్డియల్ డ్యామేజ్, గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి కలిసి పనిచేస్తాయి.
ఆహారంలోని ఇనుమును శరీరం శోషించుకోవడానికి నోటిలోని దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి మామిడి అవసరం. మామిడి పండు తినడంవల్ల నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దాంతో పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి. దంతాలు శుభ్రపడుతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా మారుతుంది. మామిడి పండ్లలో ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. మామిడి పండులో ఉండే కాపర్ ఎర్రరక్త కణాల వృద్దికి దోహదపడుతుంది. ఈ పండులో వుండే విటమిన్లు, అదేవిధంగా మామిడిపండులో బిటాకెరోటిన్ అనే పదార్దం సమృద్దిగా ఉంటుంది. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని బలోపేతం చేస్తుంది. అయితే మామిడి పండ్లను మితంగా తీసుకుంటే ఫర్వాలేదు కానీ.. లెక్కకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమే.
మామిడి పండ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఒక మోస్తరు మామిడి పండును తినడం 135 క్యాలరీలు లభిస్తాయి. అందువల్ల ఒకేసారి ఎక్కువ మామిడి పండ్లను తినడం వల్ల మీకు తెలియకుండానే బరువు పెరుగుతారు. అయితే రోజూ వ్యాయామం చేసేవాళ్లకు ఇది పెద్ద ఇబ్బంది కాదు. మామిడి పండ్లు ఎక్కువగా తిన్నా.. రోజూ ఓ అరగంట వ్యాయామం చేస్తే బరువు పెరిగే అవకాశం ఉండదు. మామిడి పండ్లలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. డయాబెటీస్ తో బాధపడుతున్నవారు మామిడి పండ్లకు దూరంగా ఉండటమే ఉత్తమం.
మితంగా తీసుకున్నంత వరకు మామిడి పండ్లు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ‘ఎ’, ‘సి’ విటమిన్లు.. ఐరన్, పొటాషియం, కాపర్, బయోయాక్టివ్ సమ్మేళనాలు.. వంటివన్నీ శరీరానికి తగిన మోతాదులో వీటి నుంచే అందుతాయట! కాబట్టి వీటిని పక్కన పెట్టి మామిడి పండ్లు తినాలన్న కోరికను చంపుకోకుండా.. మితంగా ఈ పండ్ల రుచిని ఆస్వాదించండి.