ప్రతి నిత్యం నట్స్ తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు పొందవచ్చు. శరీరానికి కావల్సిన కీలక పోషకాలు చాలా వరకు వీటి ద్వారా పొందవచ్చు. ప్రతి రోజు క్రమం తప్పకుండా గుప్పెడు నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు. నట్స్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు మనకు లభిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
మన రోజువారీ ఆహారంలో నట్స్ ను భాగంగా చేసుకోవాలి. ఇవి శరీర ఆరోగ్యాన్ని పెంపొందించే విస్తృతమైన పోషకాలను కలిగి ఉంటాయి. అవన్నీ ఆరోగ్యకరమైన కొవ్వులను, ఫైబర్ మరియు ప్రోటీన్లలతో పాటు, అనేక విటమిన్లను మరియు ఖనిజాలైన, మెగ్నీషియం మరియు విటమిన్ E లను కూడా కలిగి ఉంటాయి. రోజుకు కనీసం 20 గ్రాముల నట్స్ తింటే దాదాపు 30 శాతం హృద్రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తాయని, క్యాన్సర్ ను 15 శాతం తగ్గింప చేస్తున్నాయని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. నట్స్, కాలానుగుణంగా వచ్చే ఊబకాయ ప్రమాదాన్ని తగ్గించడానికి అవసరమైన శక్తిని కలిగి ఉంటాయి. మరియు ఇవి శక్తిని కూడా అందించగలిగేవిగా ఉంటాయి. నట్స్ అధిక రక్తపోటును మరియు కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును కూడా తగ్గిస్తుంది . కొన్ని రకాల క్యాన్సర్లకు గురికాకుండా ఉండే ప్రమాద స్థాయిలను తగ్గించవచ్చు.
- నట్స్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాల్నట్స్. వాల్నట్స్ అనేవి రూపంలో మానవ మెదడును ప్రతిబింబించేలా ఉంటాయి. అందువల్ల అవి మెదడు శక్తిని పెంపొందించేదిగా అత్యంత ప్రజాదరణనను పొందాయి. వీటిని నిత్యం 5 నుంచి 6 వరకు తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది. మెదడు చురుకుగా మారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె సంబంధ వ్యాధులు దరికిచేరవు. ఎముకలు దృఢత్వాన్ని పొందుతాయి. శరీరం మెటబాలిజం ప్రక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది.
- బాదం పప్పులో విటమిన్ ఎ, మెగ్నీషియం, ఫైబర్, కార్బొహైడ్రేట్, ప్రోటీన్ మరియు మాంగనీస్ లాంటి అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ E, మెగ్నీషియం మరియు పొటాషియం వంటివి LDL అనే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించగలవు. బాదంలో మెదడు అభివృద్ధి చెందేందుకు కీలకమైన పాత్రను పోషిస్తుంది. మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
- వేరుశెనగలు.. వీటిని మనం నిత్యం పలు వంటకాల్లోనూ, చట్నీల్లోనూ వాడుతుంటాం. అయితే వేరుశెనగలను నట్స్ రూపంలోనూ రోజూ తీసుకోవచ్చు. వీటిని కనీసం 10 నుంచి 15 వరకు నిత్యం తినడం ద్వారా శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి, మంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది. శరీరానికి ఎంతో అవసరమయ్యే ప్లాంట్ ఆధారిత ప్రోటీన్లు లభిస్తాయి.
- పిస్తా అత్యంత పోషక విలువలు కలిగినవి. వీటిని నిత్యం 8, 9 వరకు తిన్నా చాలు. గుండె సమస్యలు దరిచేరవు. బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. పొడి చర్మం ఉన్నవారు తింటే వారి చర్మం మృదువుగా మారుతుంది. పీచు ఉండడం వల్ల మలబద్దకం పోతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్తహీనతను నివారిస్తుంది. వీటిని తినడం వలన మంచి ఆరోగ్యంతో పాటు వృద్ధాప్యాన్ని కూడా మరిపించవచ్చు.
- జీడిపప్పు శరీర విధులు సరిగా నిర్వహించటానికి కావలసిన అన్ని రకాల పోషకాలు విటమిన్ లు, మినరల్ లు అన్ని జీడిపప్పులో ఉంటాయి. కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. రోజుకు 6,7 తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులు రావు. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. ఇవి అనాకార్డిక్ ఆమ్లమును కలిగి ఉండటం వల్ల, ఇవి ఇన్సులిన్ యొక్క సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి మరియు దీర్ఘకాలిక నొప్పులను నిరోధించడంలో సహాయపడుతుంది.
- పీకన్స్ అనామ్లజనకాలుగా పనిచేసే పాలీఫెనోల్స్ కలిగి ఉన్న అద్భుతమైన గింజలు. ఇవి విటమిన్ E కి మంచి మూల పదార్థంగా ఉంటూ, హానికరమైన చర్మ ఆక్సిడెంట్ల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. పీకన్స్ లో వివిధ రకాల ఫోలిక్ ఆసిడ్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటివి ఉంటాయి. నట్స్ వల్ల ఆకలి అదుపులో ఉంటుందని, ఫలితంగా బరువు పెరిగే సమస్య కూడా తగ్గుముఖం పడుతున్నట్లు పలు పరిశోధనల్లో గుర్తించారు.