మనం తీసుకొనే ఆహారాలు మన ఆరోగ్యానికి మేలు చేసేవిగా ఉండాలి. గింజ దాన్యాలలో సోయా చాల ప్రత్యేకమైనది . మిగిలిన ఆహారపదర్దాల తో పోలిస్తే సోయాబీస్స్ సమాహారమైన పోషకాలు కలిగి ఉంటుంది. కొన్ని రకాల జబ్బులను దరిచరనివ్వదు . త్వరగా జీర్ణము అవుతుంది . అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు . సోయాబీన్స్ లో లభించే మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
సోయాబీన్స్ ఎన్నోరకాల పోషకాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల జబ్బులను మన దరిచేరకుండా కాపాడుతుంది. సోయా బీన్స్ లో అధిక మొత్తంలో ప్రోటీన్’లు ఉంటాయి. అందువలనే శాఖహారులు వీటి నుండే ప్రోటీన్’లను పొందుతారు. ప్రోటీన్’లు మాత్రమే కాకుండా శరీరానికి కావలసిన అన్ని రకాల అమైనో ఆసిడ్’లు ఇందులో ఉంటాయి. ఆరోగ్యకరమైన ఫైబర్ ఉన్న సోయా ఆహారాలను తీసుకోవటం వలన, శరీర రక్తంలో గ్లూకోస్ స్థాయిలు తగ్గుతాయి. మధుమేహ వ్యాధి గ్రస్తుల శరీర కణాలు ఇన్సులిన్’ను గుర్తుపట్టేలా చేసి, ఈ హార్మోన్ వలన కణాలలో గ్లూకోస్ గ్రహించాటాన్ని అధికం చేస్తాయి.
సోయా సంబంధిత ఆహార పదార్థాలు మూత్రపిండాల విధిని సులభతరం చేస్తాయి. మూత్రపిండ సంబంధిత వ్యాధులతో భాదపడే వారు సోయా ఆహారాలను వారి రోజు ఆహర పత్యంలో కలుపుకోవటం వలన వ్యాధి సమస్యలు తగ్గుతాయి. సోయా గింజల ద్వారా వివిధ రకాల ఉత్పత్తులను పొందవచ్చు. ఇందులో సోయా ఫ్లోర్, సోయా పాలు, కాటేజ్ చీస్ ఇలాంటి చాలా రకాల ఉత్పత్తులు పొందవచ్చు.
జంతువుల నుండి పొందే ప్రోటీన్ ల కన్నా … సోయా నుంచి పొందే ప్రోటీన్’లు తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలను పొందేలా చేస్తాయి. సోయా ఉత్పత్తులు ఫైటో ఈస్ట్రోజేన్’లను కలిగి ఉంటుంది. ఈ హార్మోన్ పురుషులలో టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఈ విధంగా టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుదల వలన పౌరుష గ్రంధి క్యాన్సర్ పెరుగుదల కూడా తగ్గుతుంది. సోయా ఉత్పత్తులు శరీరంలో కోలన్ క్యాన్సర్ లేదా పెద్దపేగు క్యాన్సర్ పెరుగుదలను నివారిస్తుంది . అంతేకాకుండా, సోయా బీన్స్ జీర్ణ వ్యవస్థ మరియు అన్న వాహికను ఆరోగ్యంగా ఉంచుతుంది. సోయాలో ఉండే ఫైటో ఈస్ట్రోజేన్’లు శరీరంలో క్యాల్షియం గ్రహించటాన్ని అధికం చేసి, ఎముకల ద్రవ్యరాశి తగ్గుదలను నివారిస్తుంది. ఎముకల బలాన్ని పెంచుకోటానికి, విటమిన్ డి మరియు క్యాల్షియం అధికంగా ఉన్న సోయా బీన్స్ ను తీసుకోవడం వలన ఎముకలు దృడంగా అవుతాయి. అలాగే మనలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సోయా ఎంతగానో సహాయపడుతుంది.
సోయా ఉత్పత్తులను తినటం వలన అందులో ఉండే ప్రోటీన్’లు శరీరంలో ఉండే HDL స్థాయిలను ప్రభావిత పరచకుండా, LDL స్థాయిలను మరియు ట్రై-గ్లిసరైడ్’లను తగ్గిస్తాయి. పాలీఅన్-సాచురేటేడ్ ఫాట్’లను కలిగి ఉండే సోయా వంటి ఆహార పదార్థాలు నేరుగా శరీరంలో ఉండే LDL స్థాయిలను తగ్గిస్తాయి.సాధారణంగా మనం తీసుకునే ప్రొటీన్‌లు కొన్నిసార్లు కడుపులో అజీర్ణం చేస్తుంటాయి. కానీ వీటిలోని ఆమినో ఆమ్లాలు సాఫీగా అరిగిపోతాయి. పాలు, పెరుగు వాటికి సంబంధించిన పదార్థాలు పడనివారు సోయా పాలు తీసుకోవచ్చు. సోయా బీన్స్ లో ఉండే ఫైటో ఈస్ట్రో జెన్స్ ఈస్ట్రోజెన్ హార్మోన్ వలే పనిచేస్తాయి. ఇవి చర్మన్ని పొడిబారనివ్వవు. అలాగే వృద్ధాప్యాన్ని వాయిదా వేస్తాయి. చర్మం ముడతలు పడనీయకుండా వీటి నుంచి విటమిన్ ఇ కూడా లభిస్తుంది. ఇవి కణాల పెరుగుదలకు దోహదపడుతుంది. రెగ్యలర్ గా బీన్స్ వారంలో మూడు సార్లు తీసుకుంటే ఆరోగ్యానికి, అందానికి ఏలోటు వుండదు.
మితంగా తీసుకుంటే ఏ ఆహారమైనా ఆరోగ్యమే..పరిమితికి మించి తీసుకుంటేనే ప్రమాదం. కాబట్టి తగిన మోతాదులో సోయా బీన్స్ ను డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.