Healthy herbal Tea -మీరు ఎప్పుడైనా హెర్బల్ టీ తాగారా? – ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఈసారి మిస్​ అవ్వరు!

By manavaradhi.com

Published on:

Follow Us
Healthy herbal Tea

మనలో చాలా మంది ప్రతినిత్యం టీ తాగనిదే రోజుగడవదు అంటే అతిశయోక్తి కాదు. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు టీ తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. సహజంగా టీ నరాల ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. మనం తాగిన వెంటనే మనకి ఓ శక్తివంతమైన భావనను కలిగిస్తుంది. అయితే అధికంగా టీ తాగడం వల్ల అనేక దుష్పరిణామాలు ఉంటాయని, టీకంటే హెర్బల్ టీని, తగినంత మోతాదులో తీసుకోవడం ద్వారా అనారోగ్యాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. పలు పరిశోధనలు సైతం ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

అలసటగా ఉన్నప్పుడు మనలో చాలామంది టీ తాగాలనుకుంటాం. అయితే సాధారణ టీకి బదులుగా హెర్బల్ టీ తాగితే రిలాక్సేషన్ తో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. హెర్బల్ టీలో రకరకాల వనమూలికలు ఉంటాయి. ఇది రుచికరమే కాక అనేక రకాల ఔషదాలు ఇందులో మెండుగా ఉంటాయి. హెర్బల్ టీ తాగడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దాల్చిన చెక్కటీ ఘాటైన సువాసన కలిగి చాలా పవర్ పుల్ గా ఉంటుంది. ఈ హెర్బల్ టీని తరచుగా తీసుకోవడం వల్ల మేధాశక్తిని, ఆలోచనా శక్తిని పెంచుతుంది. దాల్చిన చెక్కలో యంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలు ఫుష్కలంగా ఉంటాయి. అలాగే వ్యాధినిరోధకతను పెంచడానికి ఇది ఎంతగానో సహయపడుతుంది.

హెర్బల్ టీ సేవనం క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇందులో పాలిఫినాల్స్ ఉన్నందున స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది, సర్వైకల్ కాన్సర్ ప్రమాదము తగ్గుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా దూరమవుతుంది. జీర్ణనాళంలోని పలు భాగాలకు వచ్చే క్యాన్సర్లకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. హెర్బల్ టీలో అధికంగా ఉండే పలురకాల ఔషధ గుణాలు, మన శరీరాన్ని ఉత్తేజపరచి, మనల్ని మరింత ఉత్సాహంగా ఉంచేందుకు సాయం చేస్తాయి. సాధారణ టీలతో పోలిస్తే హెర్బల్ టీ వల్ల ఆరోగ్యాన్ని మెరుగైన ప్రయోజనాలు ఉన్నాయి.

చాలా పరిశోధనల్లో హెర్బల్ టీ తాగడం వల్ల శరీరానికి మంచి బెనిఫిట్స్‌ ఉన్నాయని చెబుతున్నారు. అలాగే హెర్బల్ టీ బరువు తగ్గించడంలో బాగా సహాయపడు తుందని తేల్చారు. అంతే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారు. కాబట్టి సాదారణ టీ కి బదులు హెర్బల్ టీ సేవిద్దాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంద్దాం..

Leave a Comment