Health Tips: మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోండి

By manavaradhi.com

Published on:

Follow Us
How to boost immunity at home

ప్రస్తుత ఆధునికి ప్రపచంలో ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీంతో చాలా మంది తరచుగా శక్తిని కోల్పోతూ ఉంటారు. మరి అలాంటప్పుడు రోజంతా ఆహ్లాదంగా..ఉల్లాసంగా ఉండాలంటే.. మనం తీసుకోనే ఆహారం ఎక్కువ శక్తిని ఇచ్చేది అయివుండాలి. దీనివల్ల శరీరం రోజంతా చురుగ్గా మారుతుంది. శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.

ప్రతి ఒక్కరు రోజు శరీరానికి శక్తిని ఇచ్చే మంచి సమతుల ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా శక్తి అవసరం. ఇంతకీ మనకు శక్తి ఎక్కడి నుంచి లభిస్తుంది. తీసుకున్న ఆహారం జీర్ణమై.. గ్లూకోజ్ గా మారి శరీరంలో ప్రతి అవయవానికి శక్తినిస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తినిచ్చేవి కార్బొహైడ్రేట్లు. 70 నుంచి 80 శాతం కేలరీలు కార్బొహైడ్రేట్ల ద్వారానే అందుతున్నాయి. ముడి ధాన్యాలైన బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి వాటి ద్వారానూ కార్బొహైడ్రేట్లు లభిస్తాయి. పైగా వీటిలో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణశక్తికి తోడ్పడుతుంది.

జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్ మరియు హాజెల్ నట్స్… ఈ గింజల్లో ప్రోటీన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది చక్కెరను శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబ్టటి వీటి ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. కొందిరిలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కాఫీలోని కెఫిన్ మెదడులోని కర్టిసోల్ హార్మోన్ల మెరుగుపరిచి ఆందోళనను తగ్గిస్తుంది. కాఫీ మనిషిలో త్వరగా స్పందించే గుణాన్ని, ఆలోచించే సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది. అంతేకాకుండా నిస్సత్తువను మాయం చేసి దాని స్థానంలో ఎంతో ఉత్సాహాన్ని కలుగజేస్తుంది.

ప్రతి ఉదయం అల్పాహారం తినడం కూడా రోజంతా మంచి మానసిక స్థితిని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఉదయం మనం తీసుకోనే బ్రేక్ ఫాస్ట్ ఎంతో శక్తిని ఇస్తుంది. కాబట్టి ఉదయం అల్పాహారం తీసుకోవడం మర్చిపోకండి. సాల్మన్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నిరాశ నుండి రక్షించగలవు మరియు గుండె ఆరోగ్యానికి మంచివి. శరీరం ముందుకు నడవడానికి కాస్త చక్కెర స్థాయి అవసరం. ఇవి తగ్గినప్పుడు మెదడు సరైన విధంగా పని చేయదు. అందుకే మధ్యాహ్నం కాస్తంత చిరుతిళ్ళను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.

ప్రొటీన్ మిళితం చేసిన స్నాక్స్ తీసుకోవడం, తాజా పండ్లు లాంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి చక్కగా ఉంటుంది. సాధారణంగా తీసుకొనే ఆహారం జీర్ణమవడం, శక్తినివ్వడం జరగడానికి కొంత సమయం పడుతుంది. ప్రక్రియను పూర్తిగా శరీరం నిర్వహించలేని స్థితిలో పళ్ళరసాలు తేలికగా అదేశక్తినిస్తాయి. పళ్ళరసాలలో ఉండే 95 శాతం పోషకాలను శరీరం సులువుగా గ్రహించగలుగుతుంది. అలాగే నిమ్మరసం తీసుకుంటే మంచిది. శరీరాన్ని రిఫ్రెష్‌ చేయటంతో పాటు ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది.

ఒక్కోవ్యక్తికి ఒక్కో రకంగా పౌష్టికాహారం అవసరమౌతుంది. ఏదైనా సరే ఆహారాన్ని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా తీసుకోవాలి. ప్రతిరోజూ ఒకే నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. ఇలా చేస్తే మన శరీరంలో జీవక్రీయలన్ని సక్రమంగా జరుగుతాయి. మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కోన్ని ఆహార నియమాలను పాటించాలి. తీపిపదార్థాలు, వేపుడు పదార్థాలు వీలయినంత వరకు తగ్గించుకోవాలి. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినాలి. గంటకు ఒకసారి కొంతకొంత తినడం ఉత్తమం. దీనిద్వారా అసిడిటీకి దూరంగా ఉండవచ్చు.

ఆహారంలో ఎక్కువగా సలాడ్స్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏదైనా జీర్ణంకాని పదార్థాలు మీ జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడుతుంటే ఈ సలాడ్స్ ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి. కడుపు నింపుకోవడానికి కాకుండా శరీరానికి శక్తిని అందివ్వడానికి మనం ఆహారం తీసుకోవాలి. వాతావరణ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్సింగ్ ఫుడ్ అన్నీ విధాలా శ్రేయస్కరం.

మనం నిత్యం తీసుకునే ఆహారం, విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్లు.. ఇలా అన్నీ సమపాళ్లలో ఉండాలి. తీసుకునే ఆహారం ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. కాలానుగుణంగా వచ్చే పండ్లూ, కూరగాయలు ఎంచుకోవాలి. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా వేళకు సరైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి అవసరం అని గుర్తుంచుకోవాలి. వాతావరణాన్ని, ఆరోగ్య పరిస్థితిని దృష్టి పెట్టుకుని విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేడ్లు… ఇలా అన్నింటి సమ్మిళితమైన ఆహారాన్ని తీసుకోవాలి.

Leave a Comment