మనం తరచూ వండుకు తినే కూరగాయల్లో మునగకాయలు కూడా ఒకటి. కేవలం మునగకాయలే కాదు, మునగ ఆకుల వల్ల కూడా మనకు అనేక లాభాలు కలుగుతాయి. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు కూడా. మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు లభిస్తాయి. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మునగ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు అన్నిఇన్నీకావు.
ములగ ఆకు వైద్య సంబంధమైన ఒక గొప్ప ఔషధి. ములగ ఆకు వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలు చేకూరతాయి. మునగఆకులో ఉన్నంతగా ఎ, సి విటమిన్లు మరే ఇతర ఆకుకూరలోను లేవు. భాస్వరము, ఇనుము తగినంతగా ఉన్నాయి. ముఖ్యంగా మునగాకు స్టొమక్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వారికి అద్భుతంగా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మధుమేహగ్రస్తులకు కూడా చాలా మేలు చేస్తుంది. మునగాకులో ఎ, సి విటమిన్లు, క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్ కూడా అధికంగా ఉన్నాయి. మునగాకులలో అమినో ఆమ్లాలు ఉండడంవల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.
మునగాకు ద్వారా ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు లభిస్తాయి ?
మునగ మన వ్యాధినిరోధకత పెంచడానికి చక్కగా పనిచేస్తుంది. వివిధ రకాల వ్యాధులతో పోరడటానికి తగినంత వ్యాధినిరోధకత అవసరం అవుతుంది. కాబట్టి రోగనిరోధకతను బలోపేతం చేసుకోవడానికి నెలలో ఒకటి లేదా రెండు సార్లు మునగాకు తీసుకోవడం మంచిది. డయాబెటిక్ పేషంట్స్ కు మునగ ఒక ఉత్తమ రెమెడీ. మధుమేహంతో బాధపడుతున్నవారు సైతం రెగ్యులర్ డైట్ లో మునగాకును చేర్చుకోవాలి. అధిక రక్తపోటును కంట్రోల్ చేయడానికి లేదా తగ్గించుకోవడానికి మునగాకు అద్బుతంగా సహాయపడుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. మునగాకు యొక్క మరో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం పాలకన్నా 17 రెట్లు ఎక్కువ కాల్షియం మనకు మునగాకు ద్వారా లభిస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్లలకు మంచిది. దంతాలు దృఢంగా తయారవుతాయి. మునగాకులో క్యాల్షియం మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉండి ఎముకలను బలోపేతం చేస్తుంది మరియు కీళ్ళ నొప్పులను నివారిస్తుంది.
మునగాకు ఆహారంగా తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
మునగాకులో ప్రోటీన్లు కూడా ఎక్కువే ఉంటాయి. మాంసం తిననివారు మునగ ఆకులతో కూర చేసుకుని తింటే దాంతో శరీరానికి ప్రోటీన్లు బాగా లభిస్తాయి. శరీరానికి పోషణ సరిగ్గా అందుతుంది. అంతేకాదు అధికంగా పొటాషియం మనకు మునగాకు ద్వారా అందుతుంది. దీంతో గుండె సమస్యలు పోగొట్టుకోవచ్చు. రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. ఐదు రకాల క్యాన్సర్లకు మునగాకు మంచి మందుగా పనిచేస్తుంది. లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా వీటికి ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. యాంటీ ట్యూమర్‌గానూ మునగాకు పనిచేస్తుంది. థైరాయిడ్‌ను క్రమబద్ధీకరించే సహజమైన మందు నాచురల్ మెడిసిన్ మునగాకు. గర్భీణులకు, బాలింతలకు మునగాకు రసం ఎంతో మంచిది. వారికి అవసరం అయిన క్యాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
అద్భుతమైన పోషక విలువలు వుండటంతోపాటు అమోఘమైన ఔషధ లక్షణాలు కూడా మునగ ఆకు ద్వారా మనకు లభిస్తాయి. మునగ ఆకును రోజూ ఉదయాన్నే పరగడుపున తింటున్నా లేదంటే మునగ ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని రోజూ తీసుకుంటున్నా దాంతో అనేక అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీరు కూడా మునగాకును ఆహారంలో భాగం చేసుకోండి.