Health Tips: ఒమేగా 3 తో మీ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టండి

By manavaradhi.com

Published on:

Follow Us
Omega-3 Rich Foods

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ కు చెక్ పెడుతుంది. కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలు. అందులో ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే మరొకటి చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ ఆర్టిరైట్స్ లో అక్యుమ్లేట్ అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే , ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో మంచి కొలెస్ట్రాల్ నిల్వ ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు ఎందులో ఎక్కువగా లభిస్తుంది.

ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ వంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిలో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే పోషకాలు కూడా అనేక ఆహార పదార్థాలలో ఉంటాయి. ఈ పదార్థం మెదడుకు పోషణ అందిస్తుంది. రక్త నాళాలు, ఊపిరితిత్తులు ఆరోగ్యాంగా ఉండేలా చేస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు మంచిగా ఉపయోగపడుతుంది.

ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉన్న ఆహారాల వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. అవి గుండె ఆరోగ్యానికి మరియు, వయస్సు మీద పడనియ్యకుండా కాపాడుతుంది. మరియు బ్రెయిన్ హెల్త్ కు చాలా మంచిది. చాలా వరకూ అన్ని రకాల చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ స్పెషల్ గా ఫ్యాటీ ఫిష్ అంటే సాల్మన్ ఫిష్ లో ఈ న్యూట్రియట్ అధిక మొత్తంలో ఉంటుంది.

శాకాహారంలో ఫ్లాక్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉన్నాయి. అంతే కాదు ప్లాక్ సీడ్స్ లో గల EPA మరియు DHA లు కూడా ఉన్నాయి. వాల్ నట్స్ లో రెండు ప్రధానమైన న్యూట్రీషియన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ‘విటమిన్ ఇ’ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. వాల్ నట్స్ హార్ట్ హెల్తీ ఫుడ్ మాత్రమే కాదు చర్మం సాగే గుణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

గుమ్మడికాయ విత్తనాలు, అవిసె గింజలు, చేపలు, వాల్‌నట్స్ వంటి వాటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహార పదార్థాలను తరుచుగా డైట్‌లో చేర్చుకోవడం వలన శరీరానికి కావలసిన పోషక విలువలు అందుతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఆస్తమా, శరీర వాపులు, నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ పదార్థం నిద్రలేమి సమస్య నుండి కాపాడుతుంది.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలను అధికంగా ఆహారంలో చేర్చుకుంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో గుండెపోటు రాకుండా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీఆసిడ్స్ మతిమరుపు నివారించి మెమరీని పెంచుతుంది . కొన్ని పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఫిష్ తినే వారిలో మంచి జ్ఝాపకశక్తి ఉంటుందంటారు. ఫ్యాటీ యాసిడ్స్ లర్నింగ్ మరియు మెమరీ ఫంక్షన్ పెంచుతుంది. మతిమరుపు నివారిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల మూడ్ డిజార్డ్స్ మరియు అభిజ్ఞాత్మక శక్తి లోపిస్తుంది. కాబట్టి వీటిని డైట్ లో చేర్చుకుంటే మూడ్ ను మెరుగుపరచడంలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయపడుతాయి.

ఒమేగా 3 వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ?
ఒమేగా3 ఫ్యాటీయాసిడ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది . జంక్ ఫుడ్స్ లో బ్యాడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఫిష్ ఆయిల్లో జంక్ ఫుడ్ మరియు ఎక్సెస్ ఫ్యాట్ ఫుడ్స్ వల్ల బ్రెయిన్ కు ఎఫెక్ట్ కాకుండా చేస్తుంది. ఒమేగా3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల లర్నింగ్ మరియు మెమరీ స్టిమిలేటింగ్ ఏరియాస్ ను డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది.

ఒమేగా 3ఫ్యాటీయాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. వ్యాధులు మరియు గాయాల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో నేచురల్ హీలింగ్ ప్రొసెస్ ను కలిగి ఉంటుంది. దీర్ఘకాలంగా ఉన్న గాయాలను, నొప్పులను తగ్గించలేనప్పుడు క్రోనిక్ ఇన్ల్ఫమేటరీ క్రమంగా టిష్యు డ్యామేజ్ కలిగిస్తుంది. ఇది క్రోనిక్ డిసీజ్ కు దారితీస్తుంది.వాటిలో ముఖ్యంగా హార్ట్, ఆర్థరైటిస్, క్యాన్సర్, వ్యాస్కులర్ మరియు మెటబాలిక్ సిండ్రోమ్ వంటి ప్రమాదస్థితికి దారితీస్తుంది.

ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ తో పోరాడుతుంది . వాటికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి తగ్గించడంలో ఫిష్ ఆయిల్ గ్రేట్ గా పనిచేస్తుందని స్టడీస్ వెల్లడి చేశాయి. మహిళల్లో మోనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల గుండెసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు మంచి కొలెస్ట్రాల్ తీసుకోవడం వల్ల ప్రమాదం నుంచి వారిని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

ఒమేగా 3 ఫుడ్స్‌ శరీరంలోని ఫ్యాట్‌ను , రక్తంలోని ఫ్యాట్‌ను నియంత్రిస్తాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి. మకెరల్‌, ట్యూనా లాంటి చేపల్లో ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ బాగా ఉంటాయి. వీటిని తింటే ఎంతో మంచిది. అలాగే అవిశలు, అవిశనూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఊబకాయం తగ్గించుకోవడానికి డైటింగ్‌ చేసేవాళ్లు ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ను సప్లిమెంట్ల రూపంలోగాని, ఆహారం రూపంలోగానీ తీసుకోవాలి.

Leave a Comment