సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతుంటారు. అందులో ఉండే ఘాటును కొందరు ఎంజాయ్ చేస్తుంటే.. ఇంకొందరు అమ్మో అంతా కారం తినలేమంటూ మిరపకాయలను దూరంగా పెడుతుంటారు. మిరప కాయల్లో కూడా పచ్చి మిరపా, పండు మిరప కాయలు మనకు ఎక్కువగా లభిస్తాయి. వీటిలో మకు చాలా పోషకాలు లభిస్తాయి.
సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతారు. కారంగా ఉంటుంది. తినలేమంటూ వంటలో వాడినా పక్కన పడేస్తుంటారు. అయితే మిరపకాయలు తింటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. పచ్చి మిరపకాయలను నిత్యం మనం అనేక కూరల్లో వేస్తుంటాం. ఎండు కారంకు బదులుగా వీటిని కారం కోసం చాలా మంది కూరల్లో వేస్తారు. పచ్చి మిరప వల్ల కూరలకు చక్కని రుచి వస్తుంది. కొందరు మజ్జిగలో వీటిని ఆరగిస్తారు. అయితే నిజానికి పచ్చి మిరపకాయలు కారంగా ఉన్నప్పటికీ వాటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి.
పచ్చి మిరపకాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మిరపకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే పచ్చి మిరపలో విటమిన్ బి6, విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి. జీర్ణవ్యవస్థమ మెరుగ్గా పనిచేస్తుంది పచ్చి మిరపకాయలను విత్తనాలతో సహా తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
పచ్చి మిర్చిలో శరీరపు మెటబాలిజంను ప్రేరేపించే క్యాస్పేసియన్ అనే ఓ పదార్థం ఉంది. ఇది మెదడులోని హైపోథాలమస్ అనే కేంద్రాన్ని ప్రేరేపించడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పచ్చి మిరపకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది.
మిరపకాయ రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని వృద్ధి పరుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దెబ్బ తగిలినపుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉంది. పచ్చిమిరప విత్తనాల్లో ఫైటోస్టెరాల్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. పేగుల నుంచి కొలెస్ట్రాల్ రక్తంలోకి చేరకుండా చూస్తుంది. దీంతోపాటు రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
ఊబకాయ సమస్య ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది. చిన్నవయసులోనే ఆహారపు అలవాట్లు, మరికొన్ని కారణాలతో ఈ సమస్య చుట్టుముడుతుంది. దీంతో మరెన్నో రోగాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. అయితే, పండు మిర్చి అనేది ఈ సమస్యకు చక్కని పరిష్కారంగా ఉంటుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.ఎన్నో ఆరోగ్యసమస్యలకి పండు మిర్చి చక్కని పరిష్కారం. పండుమిర్చిలో ఉండే కేప్సెసిన్ అనే పదార్థం.. రక్తప్రసారాన్ని మెరుగుపరుచుతుంది. అంతేకాక.. శరీరంలోని హానికారక క్రిములను నశింపంజేస్తుంది. దీనివల్ల మన కణాల మీద ఉండే టీఆర్‌పీ అనే వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుందట. దీనివల్ల దీర్ఘాయుష్షు పెరుగుతుందని చెబుతున్నారు.
పచ్చి మిరపా? పండు మిరపా? మన ఆరోగ్యానికి ఏది మంచిది?
ఆకుపచ్చని పచ్చిమిర్చి, పసుపురంగు పచ్చిమిర్చిలతో పోలిస్తే పండుమిర్చిలో విటమిన్ సి, బీటాకెరోటిన్‌ల శాతం ఎక్కువ. ఎ, బి, సి విటమిన్లతో పాటు ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్‌తోనూ పోరాడగలదు. ముఖ్యంగా ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు ఇది సహాయపడుతుందట. పొట్టలో హానికర బ్యాక్టీరియాని నివారిస్తుంది.
పండు మిర్చి రంగు చూస్తేనే నోరూరుతుంది. అంటే ఆకలిని పెంచినట్లేగా. అలాగే ఇది రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేయడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వుని సైతం కరిగించే గుణాలు ఇందులో ఉంటాయి. జలుబూ, జ్వరాలు రాకుండా నిరోధించే గుణాలూ ఇందులో ఎక్కువే. నొప్పులకి కారణమయ్యే ఇన్‌ప్లమేషన్లని తగ్గిస్తుంది. దాని ఫలితంగానే ఆర్ధ్రయిటీస్, సోరియాసిస్, డయోబెటిక్, న్యూరోపతి.. వంటి వాటి కారణంగా తలెత్తే నొప్పుల్ని తగ్గించే గుణం పండుమిర్చిలో ఎక్కువ.
పండు మిర్చి తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే, జీర్ణశక్తినీ, జీవక్రియనీ పెంచడంతో పాటు బరువు పెరగకుండానూ చేస్తుంది. ఇది తిన్నాక పుట్టే వేడి కారణంగా వ్యాయామంలో మాదిరిగా క్యాలరీలు కరుగుతాయి.ఆస్తమా, సైనస్, జలుబులతో బాధపడేవాళ్లు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఊపిరితిత్తులు, గొంతు, ముక్కుల్లో శ్లేష్మం, మ్యూకస్ పేరుకోకుండా ఉంటుంది. పండుమిర్చి వాసన తలనొప్పుల్ని తగ్గిస్తుంది.
రోజుకు కొంత మోతాదులో మిరపకాయలు తీసుకోవడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. దీని పట్ల అవగాహనతో రోజూ ఆహారంలో వీటికి ప్రాధాన్యత ఇద్దాం… అయితే కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు వీటికి దూరంగా ఉంటేనే మేలు.