Government job : పది పాసైతే చాలు! సాయుధ దళాల్లో కానిస్టేబుల్‌.. రూ.40 వేలు జీతం.

By manavaradhi.com

Published on:

Follow Us

నిరుద్యోగులకు సువర్ణావకాశం. పదో తరగతి పాసైతే చాలు కేంద్ర సాయుధ దళాల్లో చేరవచ్చు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 26,146 కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మహిళలూ కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌, దేహదార్ఢ్య, శారీరక ప్రమాణ, మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. ఎవరైతే వీటన్నిటిని ఎదుర్కొని ఉద్యోగానికి సెలక్ట్ అవుతారో వారిని శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే సుమారు రూ.40 వేల వేతనం అందుకోవచ్చు. ప్రతి సంవత్సరం జీతం పెరుగుతుంది అంతేకాదు భవిష్యత్తులో పదోన్నతు కూడా ఉంటాయి.

కేంద్రం ప్రతి సంవత్సరం సాయుధ దళాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేస్తోంది. జనరల్‌ అభ్యర్థులు 23 ఏళ్ల వయసు వరకు పదో తరగతి విద్యార్హతతో ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఎంపికైనవారు.. ఆసక్తి, మెరిట్‌ ప్రకారం బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌)లో నచ్చిన విభాగంలో సేవలు అందించవచ్చు. వీటిలో ఎందులో చేరినప్పటికీ వేతనం మాత్రం అందరికీ సమానమే. వీరు శిక్షణ అనంతరం విధుల్లోకి చేరిన తర్వాత లెవెల్‌-3 మూలవేతనం రూ.21,700 పొందుతారు. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు దక్కుతాయి తొలి నెల నుంచే సుమారు రూ.40 వేలు అందుకోవచ్చు.

Leave a Comment