Health Tips : పురుషుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చిట్కాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Health Tips for Men

యుక్త వయసులో చాలా మంది మరగవారు ఆరోగ్యం విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టరు. ఆరోగ్యంగా ఉన్నానని మానసికంగా భావించడం మంచిదే. అయితే జాగ్రత్తల విషయంలో దూరం కావడం అస్సలు మంచిది కాదు. మనకు ఇష్టం వచ్చినది తినేస్తూ, తాగేస్తూ జీవితాన్ని లాగుతూ ఉంటాం. ఎవరైనా అప్రమత్తత గురించి చెబితే, నాకేం జబ్బు లు లేవు అనుకుంటూ ఉంటారు… ముందు ఈ ఆలోచన మానుకోవాలి. 20లు 30 ల్లో మగవారు ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలి.

మగవారు తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. పౌష్టికాహారం అనేది మగవారికి అత్యంత ముఖ్యమైంది. శరీరానికి నిద్ర ఎంత అవసరమో పౌష్టికాహారం కూడా అంతే ముఖ్యం. శరీరానికి క్యాలరీలు చాలా అవసరం. వివిధ రకాల ఆరోగ్యకర ఆహారం అనేది చాలా అవసరం. పరిమితంగానైనా పోషకవిలువలు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. చాలా మంది రోజూ ఒకే రకమైన ఆహారం తీసుకోవడం కూడా అనారోగ్య సమస్యలకు కారణం అవుతోంది.

ఏదో ఒకటిలే అనే జంక్ ఫుడ్స్ విపరీతంగా తినేస్తూ ఉంటారు. పండ్ల జోలికి అస్సలు వెళ్లరు. నిజానికి ఫైబర్ ఉండే పళ్ళు… ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే రోజుకు కనీసం 2 మార్లు పండ్లను తీసుకోవాలని వైద్యు చెబుతారు. దీని వల్ల గుండె, క్యాన్సర్, జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. వర్కవుట్లు అనేవి చాలా ముఖ్యమైనవి. ఎప్పుడు ఒకే మాదిరి వర్కవుట్లు చేయడం వల్ల మగవారి ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు తక్కువే అని చెప్పొచ్చు. వివిధ రకాల వ్యాయామాలు చేయాలి. వయసుకు తగ్గట్టుగా వర్కవుట్లు చేయాలి.

నిద్ర కూడా అత్యంత ప్రాముఖ్యతనిచ్చే అంశాల్లో ఒకటి. కనీసం ఏడెనిమిది గంటల నిద్ర మగవారికి అవసరం. నిద్ర తక్కువైతే ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నట్టే. మనలో చాలామంది శారీరకంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండటం లేదు. ఏ వ్యక్తి అయినా మానసికంగా ఫిట్ అయితే శారీరకంగా ఫిట్ అయ్యే చాన్స్ ఉంటుంది. ప్రొస్టేట్ సంరక్షణ వల్ల మగవారి ఆరోగ్యం ఎంతో బాగుంటుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.

వయసు పెరుగుతున్న మగవారికి ప్రోస్టేట్ పెరిగే అవకాశాలు పెరుగుతాయి. దీంతో వీరిలో మూత్రానికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. అందువల్ల తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇక కీలకంగా చెప్పుకోవలసిన ముఖ్యమైన అంశం… యువకులమంటూ కొని తెచ్చుకునే చెడు అలవాట్లు. ఇందులో ధూమ పానం, మద్య పానం, థ్రిల్లింగ్ కోసం చేసే ఎన్నో పనులు ఉంటాయి. వీటి వల్ల కూడా ఎంతో మంది శారీరక, మానసిక అనారోగ్యాల బారిన పడుతున్నారు. వీటికి సాద్యమైనంత దూరంగా ఉంటే మంచిది.

శరీరంలో ఏవైనా అనారోగ్యకర మార్పులు వస్తుంటే వాటిని తొలి దశలోనే గుర్తించి సమర్థంగా ఎదుర్కొనటానికి స్క్రీన్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఎలాంటి వైద్యపరీక్షలు చేయించుకోవాలి? ఎప్పుడు చేయించుకోవాలి? అన్న అవగాహన తప్పనిసరిగా ఉండాలి. 25-30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకోవాలి. గుండె సంబంధ సమస్యల గురించి యువకులు అస్సలు పట్టించుకోరు. ఈ వయసులో గుండె పోటు ఏమిటి అనుకుంటారు. పరీక్ష చేయించుకోవడానికి కూడా ముందుకురారు. 30 ఏళ్ల వయసులోనే గుండె పోటుకు తొలిబీజం పడుతుంది.

25 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి ఈసీజీ పరీక్ష చేయించుకోవటం మంచిది. చాలా తేలిక పాటి పరీక్ష. ఇది గుండె పనితీరు గురించి అమూల్యమైన సమాచారాన్ని అందిస్తుంది. రకరకాల కారణాలతో అన్ని వయసుల వారిలో మధుమేహం వస్తోంది. కాబట్టి 25 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి రక్తపరీక్ష ద్వారా రక్తంలో గ్లూకోజ్‌ శాతాన్ని తెలుసుకోవాలి. ఏదో ఒక సమస్య ఉంటేనే వైద్యుని సంప్రదించడం కాదు, సమస్య లేకపోయినా, తెలియని సమస్యలు ఉన్నాయోమో తెలుసుకోవడానికైనా వైద్యుని సంప్రదించాలి.

రోజూ వ్యాయామం చేయడం మంచి పోషకాహారం తీసుకోవడం.. ఆరోగ్యంపట్ల శ్రద్ద వహించడం.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవగానే వైద్యులను సంప్రదించడం అలవాటు చేసుకుంటే పురుషుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా మద్యం , స్మోకింగ్ లాంటి దురలవాట్లను మానుకుంటే మంచిది.

Leave a Comment