Physiotherapy: ఎన్నో జబ్బులను మందులతో కాకుండా కేవలం ఫిజియోథెరపీతో నయం చేస్తున్నారు

By manavaradhi.com

Published on:

Follow Us
Physiotherapy

ఫిజియోథెరపీ అంటే ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌. ప్రస్తుతం .. ఎన్నో జబ్బులను మందుల ద్వారా కాకుండా కేవలం ఫిజియోథెరపీ ద్వారా నయం చేస్తున్నారు. శారీరక సమస్యలకు సంబంధించిన ఎన్నో దీర్ఘకాలిక జబ్బులను ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌ ద్వారా తగ్గించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థో, న్యూరో స్పెషలిస్టులు తమ వద్దకు వచ్చే రోగుల శారీరక సమస్యలను బట్టి అందుకు అనుగుణంగా శారీరక వ్యాయామాలను చేయాలని సూచిస్తారు. అయితే ఎలాంటి సమస్యలకు ఏ విధమైన వ్యాయామం చేయాలనే విషయంలో ప్రత్యేకంగా ఫిజియోథెరపిస్టు ఆధ్వర్యంలో ఈ వైద్యాన్ని పొందవచ్చు.

నేటి ఆధునిక వైద్య వృత్తిలో ఫిజియోథెరపీని ఒక నూతన అధ్యాయం. వైద్య చికిత్సలో మందులు మాత్రమే కాదు ఫిజికల్ చేసే థెరపీ కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అనారోగ్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనకు ఎలాంటి గాయాలైనా లేదా సర్జరీ తర్వాత ఉపశమనం కోసం లేదా ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేందుకు ఫిజియోథెరపీ బాగా పని చేస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం లభించడంతోపాటు జీవక్రియలు బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది.

గాయాలైనప్పుడు తీవ్రంగా ఉన్న నొప్పిని తగ్గించేందుకు కాళ్లు, చేతులు లేదా ఇతర అవయవాల కదలిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఫిజియోథెరపీని ఉపయోగిస్తారు. ఆటలాడేటప్పుడు క్రీడాకారులకు గాయాలైతే వాటి నుంచి రికవరీ చేయడానికి ఫిజియో థెరపీ ప్రక్రియ వాడతారు. సర్జరీ తర్వాత రోగులు సరిగ్గా తమ అవయవాలను కదిలించడంలో ఇబ్బందిపడే వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత మహిళలు సాధారణ స్థితికి రావాలంటే ఫిజియో థెరపీ చేయించుకోవాలి.

పుట్టుకతో పాటు లేదా ప్రమాదాల కారణంగా, అనారోగ్యాల మూలంగా సతమతమయ్యే వారెందరికో ఫిజియోథెరపీ గొప్ప ఉపశమనం. దివ్యాంగులకు, మాననసిక ఒత్తిడితో సతమతమయ్యే వారికి కూడా ఫిజియోథెరపీ ఒక వరమని చెప్పాలి. ఫిజియో థెరపీ ఏ వయసు వారైనా చేయించుకోవచ్చు. దీనికి వయసుతో నిమిత్తం లేదు. వైద్యుల సూచనల మేరకు ఫిజియో థెరపిస్టులు రకరకాల చికిత్సలను రోగులకు అందిస్తారు.

రకరకాల నూనెలతో మసాజ్ లు చేయడం, రకరకాల ఎక్సర్ సైజ్ లు చేయించడం వల్ల అనారోగ్యం తగ్గిపోయి అవయవాల్లో కదలిక వస్తుంది. ఐతే ఫిజియో థెరపిస్టులు వైద్య నిపుణుల సూచనలతో చికిత్స చేస్తారు. చిన్న చిన్న సమస్యలకు నేరుగా ట్రీట్ మెంట్ అందించినప్పటికీ .. దీర్ఘకాలిక రోగాలకు వీరు వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఫిజియో థెరపీలో రకరకాల వైద్య చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాయామాలు చేయించడం .. చేతులు, కాళ్లు లేదా శరీరాన్ని సాగదీసే వ్యాయామాలు చేయించడం.. మసాజ్, హైడ్రో థెరపీ , అల్ట్రా సౌండ్ థెరపీ.. జీరియాట్రిక్ వ్యాయామాలు లాంటి చికిత్సలు నేడు అందుబాటులో ఉన్నాయి.

కండరాల నొప్పి తగ్గించడం .. అవయవాల్లో కదలిక తీసుసుకురావడం.. ఈ చికిత్స ప్రధాన ఉద్దేశ్యం. ఐతే చికిత్స ఎన్ని రోజులు చేయాలనేది ఫిజియో థెరపిస్టులు నిర్ణయిస్తారు. ఎవరైనా గాయం, వైకల్యం కారణంగా బాధపడుతున్నప్పుడు శరీర భాగాల కదలిక పనితీరును సాధారణ స్థితికి తెచ్చేందుకు ఫిజియోథెరపీ చికిత్స ఉపయోగపడుతుంది. ఇది వ్యాధి వైకల్యాన్ని నివారించడానికి అంచనా వేసి నిర్ధారిస్తుంది. ముఖ్యంగా పక్షవాతం, మెడనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, భుజం నొప్పి, వెన్ను సమస్యలు శస్త్ర చికిత్సకు ముందు తర్వాత వాటి పనితీరును పునరుద్ధరించడానికి రిహాబిలిటేషన్ ఉపయోగపడుతుంది. నరాల బలహీనతలు, పనిచేసే చోట వచ్చే సమస్యలను అధిగమించేందుకు ఫిజియోథెరపీ ఎంతగానో దోహదపడుతుంది.

ఆర్థో, న్యూరో స్పెషలిస్టులు తమ వద్దకు వచ్చే రోగుల శారీరక సమస్యలను బట్టి అందుకు అనుగుణంగా శారీరక వ్యాయామాలను చేయాలని సూచిస్తారు. అయితే ఎలాంటి సమస్యలకు ఏ విధమైన వ్యాయామం చేయాలనే విషయంలో ప్రత్యేకంగా ఫిజియోథెరపిస్టు ఆధ్వర్యంలో ఈ వైద్యాన్ని పొందవచ్చు. మందులతో వచ్చే సైడ్‌ ఎఫెక్‌ట్స ఈ విధానంలో ఉండవు కాబట్టి ఎంతో మంది ఫిజియోథెరపీ విధానాన్ని సురక్షిత వైద్యంగా భావిస్తున్నారు.

భౌతిక వ్యాయామం, పరికరాలతో చికిత్స, హైడ్రోథెరపీ, డ్రై నీడ్ లింగ్ తదితర విధానాల ద్వారా ఫిజియోథెరపీ చికిత్స అందించవచ్చు. శరీరంలో ఏదైనా ఎముక, కండరం విరిగితే శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు సాధారణంగా ఫిజియోథెరపీని రెఫర్ చేస్తారు. గాయమైన కండరం, ఎముక తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు ఫిజియోథెరపీ చేయాలని సూచిస్తుంటారు. ఫిజియోథెరఫీ చేయించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రమై ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

Leave a Comment