PMJDY – ప్రధానమంత్రి జన్ ధన్ యోజన గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి..!

By manavaradhi.com

Updated on:

Follow Us

Pradhan Mantri Jan Dhan Yojana: కేంద్ర ప్రభుత్వం అందింస్తున్న అద్భుతమైన పథకాల్లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఒకటి అని చెప్పాలి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పిఎంజెడివై) ఒక జాతీయ ఉద్యమం. ఒక సంచలనాన్నే సృష్టించిన కార్యక్రమాల్లో ఇది ఒకటి. ప్రధానమంత్రి జన్ ధన్ పథకం కింద ఇప్పటి వరకు మొత్తం 50 కోట్ల కంటే ఎక్కువ జన్ ధన్ ఖాతాలు తెరవబడ్డాయి. ఈ ఖాతాల్లో మొత్తం రూ.2.03 లక్షల కోట్లు జమ అయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో భారతీయ జనపార్టీ అధికారాంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా మన దేశ ప్రజలందరూ జాతీయ ఆర్థిక భాగస్వామ్యాన్ని పొందేలా చేయడానికి ఉద్దేశించిన పథకం”ప్రధానమంత్రి జన్ ధన్ యోజన”. బ్యాంకింగ్ సేవలు, పొదుపు ఖాతాలు, అప్పులు, చెల్లింపులు, బీమా, పింఛన్ తదితర సౌకర్యాలన్నిటినీ సులభసాధ్యం చేయడం కోసం రూపొందించిన పథకం ఇది. అన్ని బ్యాంకింగ్ సదుపాయాలు గ్రామాల్లోని నిరుపేదలకు కూడా అందుబాట్లోకి తేవడానికి చేసిన ఒక చక్కటి ప్రయత్నం ఇది. దీని ద్వారా అనేక కొట్ల మంది పెదప్రజలకు లబ్ధిచేకూరుతుంది.

 1. పైసా లేకుండా బ్యాంక్ ఖాతాను ప్రారంభించే సౌకర్యం.
 2. రూపే డెబిట్ కార్డ్ సౌకర్యం.
 3. ఒక లక్ష రూపాయల ప్రమాద బీమా సౌకర్యం
 4. ఖాతాలో కనీస మొత్తం నిలవ చేయాల్సిన అవసరం లేదు.
 5. భారతదేశంలో ఎక్కడికైనా తేలికగా డబ్బు బదలాయింపు చేసుకునే సౌకర్యం
 6. ప్రభుత్వపథకాల లబ్దిదారులకు నేరుగా లబ్ధి బదలాయింపు సౌకర్యం. (డిబిటి – డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్)
 7. ఆరునెలల పాటు బ్యాంకు లావాదేవీలను సక్రమంగా నిర్వహించిన వారికి రూ. 5000/ – ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. (అప్పుగా వాడుకునే సౌకర్యం)
 8. ఈ ఖాతానుంచి పెన్షన్, బీమా సొమ్ములను పొందే వెసులుబాటు

ఈ పథకం కింద పేద వర్గాలకు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో చేరే అవకాశం లభించింది. ప్రభుత్వం ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ పథకం డబ్బును నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు DBT ద్వారా బదిలీ చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, వారు ఈ ఖాతా నుండి ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు ఈ ఖాతా సాయంతో లబ్ధిదారులు బీమా పథకం ప్రయోజనాలను కూడా పొందుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే, ఖాతా నుండి ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. ఏ బ్యాంకులోనైనా ఈ ఖాతాను తెరవవచ్చు. దీని కోసం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్ మాత్రమే అవసరం.

ఈ ఖాతాను ఎవరు ప్రారంభించవచ్చు?

పదేళ్లు దాటిన ఎవరైనా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.

నిరక్షరాస్యులు కూడా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. అయితే నిరక్షరాస్యుల విషయంలో రూపే డెబిట్ కార్డును ఇచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలను బ్యాంక్ మేనేజర్ స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది.

ఉమ్మడి (జాయింట్) ఖాతాను కూడా ప్రారంభించవచ్చు.

బ్యాంకు ఖాతా ఉన్న వ్యక్తికి బీమా మరియు రుణ సౌకర్యం పొందేందుకుగాను రూపే డెబిట్ కార్డును అతని ప్రస్తుత ఖాతాలోనే ఇస్తారు.

పిఎంజెడివై ఖాతా ప్రారంభించడానికి కావలసిన పత్రాలు

ఆధార్ కార్డ్ ఉంటే గనుక మరే పత్రాల అవసరం ఉండదు. అయితే చిరునామా మారితే మాత్రం కొత్త చిరునామాను మీరు రాసి ఇస్తే చాలు. ఆధార్ కార్డ్ లేకపోతే గనుక ఈ అధికారిక దృవపత్రాలలో ఏదైనా ఒకటి ఉంటే చాలు: ఓటరు గుర్తింపు కార్డు / డ్రైవింగ్ లైసెన్స్ / పాన్ కార్డ్ / పాస్సోర్ట్ / మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ / వీటిలో మీ చిరునామా కూడా ఉంటే గనుక అది మీ గుర్తింపు మరియు చిరునామా రెండింటికీ సరిపోతాయి.

పైన పేర్కొన్న అధికారిక ధ్రువపత్రాల్లో ఏదీ లేకపోతే గనుక ఈ కింది పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించి ఖాతను ప్రారంభించవచ్చు.

 1. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్థిర/ నియంత్రణ అధికార యంత్రాంగం, ప్రభుత్వ సంస్థలు, షెడ్యుల్డు కమర్షియల్ బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు జారీ చేసిన దరఖాస్తుదారు ఫోటోతో ఉన్న గుర్తింపుకార్డులు
 2. దరఖాస్తు దారు ఫోటో అతికించి ఉన్న, గజిటెడ్ ఆఫీసర్ లేఖ.

పిఎంజెడివై ఖాతాను ఎక్కడ ప్రారంభించవచ్చు?

ఏ బ్యాంక్ శాఖలోనైనా లేదా బిజినెస్ కరస్పాండెంట్ (బ్యాంక్ మిత్ర) ద్వారానైనా ప్రారంభించవచ్చు.

 • దరఖాస్తు దారు కోరితే పిఎంజెడివై ఖాతాను ఏ ప్రాంతంలో ఉన్న బ్యాంకు శాఖకైనా చాలా తేలికగా బదలాయించవచ్చు.

Leave a Comment