High in Vitamin E : ఇమ్యూనిటీ పెంచే విటమిన్ ఇ ఆహారాలు ఇవే!

By manavaradhi.com

Published on:

Follow Us
High in Vitamin E

విటమిన్ ఇ ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. విటమిన్‌ ఇ సమపాళ్లలో అందితే శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్‌ దూరం అవుతాయి. చర్మం మెరిసిపోతుంది. కంటికి వచ్చే మాక్యూలార్ డీజనరేషన్ అనే వ్యాధిని ఇ విటమిన్ చాలా వరకూ నివారిస్తుంది. చూపు స్పష్టతకు తోడ్పడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

సౌందర్యానికి, ఆరోగ్యానికి కొన్ని విటమిన్లు బాగా పనిచేస్తాయి. శరీరంలో విటమిన్ల పాత్ర కీలకమైనది. శరీరానికి కావల్సిన విటమిన్లలో ఏ ఒక్క విటమిన్ లోపించినా అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. విటమిన్లలో ఆరోగ్యానికి, సౌందర్యానికి కేరాఫ్ గా విటమిన్ ‘ఇ’ అని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళల్లో గర్భాధారణ విషయంలో విటమిన్ ఇ ఎంతో అవసరం అవుతుంది. అలాగే పురుషుల్లో వంధ్యత్వం నివారించడానికి విటమిన్ ఇ అవసరం అవుతుంది. హానికరమైన ఫ్రీరాడికల్ అణువును తొలగించడానికి మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు విటమిన్ ఇ లో అధికంగా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో చర్మసౌందర్యాన్ని ఇదే ఇనుమడింపజేస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి విటమిన్ E మన శరీరంలోని ఫ్రీర్యాడికల్స్ ను మరియు క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తనాళాలు సాగే గుణాన్ని పెంచి అవసరమైన పరిస్థితుల్లో రక్తం సాఫీగా ప్రవహించడానికి సహాయపడుతుంది.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్ లో అత్యధిక శాతంలో విటమిన్ ఇ ఉంటుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి పలు రకాలుగా సహాయపడుతుంది. .బ్రకోలి..ఇది క్యాలీఫ్లవర్ లాగా ఉంటుంది. ఇందులో పోషక తత్వాలు విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. ఉడికించిన లేదా పచ్చి బ్రకోలిని వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకుంటే కండరాల నొప్పులు తొలగించడమే కాకుండా కాలేయాన్ని కాపాడుతుంది. పాలకూరలో విటమిన్ ఇ, మాంగనీస్, మెగ్నిషియం, ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా చేయుటకు ఉపయోగపడుతుంది.

అవకాడోలో విటమిన్ ఇ లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధులకు, క్యాన్సర్‌కు ఎంతో మేలుచేస్తుంది. దీనివలన మతిమరుపు వంటి సమస్యలు తొలగిపోతాయి. విటమిన్ ఇ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. ఆరోగ్యానికి ఉపయోగపడే తులసి, ఓరిగానో వంటివి విటమిన్ ఇ ని అధికంగా కలిగి ఉంటాయి. వీటిని ఇటాలియన్ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా సలాడ్స్, సూపుల్లో వేసి మరింత టేస్టీగా ఉండేలా తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వేరుశెనక్కాయలు ఆకలిని తీర్చడంతో పాటు, బరువును తగ్గించి బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉన్న విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్ మ్యూకస్ గ్లాండ్స్ ను క్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది.

విటమిన్ ఈ మనకు ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నట్స్, ఆలివ్ ఆయిల్, చేపలు, సన్ ఫ్లవర్ సీడ్స్, బాదం పప్పు, పాలకూర, అవకాడోలలో లభిస్తుంది. సన్ ఫ్లవర్ సీడ్స్ ను తరచూ వైద్యుల సలహా ప్రకారం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.అదేవిధంగా విటమిన్ ఇ అధికంగా ఉండే బాదం పప్పు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. బీపీని నియంత్రణలో ఉంచుతుంది. రెడ్ బెల్ పెప్పర్ లో అత్యధికంగా విటమిన్ ఇ మరియు విటమిన్ సి ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.

నట్స్ లో చాలా మంచి టేస్ట్ కలది, ఇష్టమైన స్నాక్ పిస్తా. కాబట్టి ఈ పిస్తాను మీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా ఉప్పు లేనటువంటి. లేదా ఫ్రై చేయనటువంటి పిస్తాలను తీసుకోవాలి. ఇందులో న్యూట్రీషియన్స్, మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి.రెడ్ చిల్లీలో ఉన్న క్యాప్సియాసిన్, శరీరంలో కొన్ని ఉత్పత్తి అయ్యే రసాయనాల వల్ల కలిగే నొప్పిని ఆపుతుంది. కీళ్ళనొప్పులను పోగొట్టడానికి ఇందులో ఉన్న పెప్పరైన్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఇ ఉండే పాలకూర హైబీపీని తగ్గిస్తుంది. ఎముకలను కూడా దృఢంగా ఉంచుతుంది. పొడి చర్మం ఉన్న వారు విటమిన్ ఇ తీసుకుంటే చర్మం సున్నితంగా తయారవుతుంది. పెద్దల నుంచి అప్పుడే పుట్టిన పిల్లలకు ఇ విటమిన్ ఎంతో అవసరం.

మన శరీరంలో జరిగి అనేక కార్యకలాపాలను మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు. ఈ జీవక్రియలు సరిగా జరగడానికి ఇ విటమిన్ దోహదపడుతుంది. మనలో వ్యాధి నిరోధకతను పెంపొంధించుకోవడానికి విటమిన్ ఇ ఆహారాలు అధికంగా తీసుకోవాలి. ఇ విటమిన్ అధికంగా ఉండే ఆహారాలు తరచూ తీసుకొనే డైయట్ లిస్ట్ లో చేర్చడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవచ్చు.

Leave a Comment