Nails and Health : గోళ్ల రంగును అర్థం చేసుకుంటే.. మన ఆరోగ్యాన్ని తెలుపుతాయట..!

By manavaradhi.com

Updated on:

Follow Us

గోళ్ళు మన ఆరోగ్యానికి సూచికలు. జట్టు మాదిరిగానే గోళ్లు కూడా కెరటిన్‌ అనే ప్రొటీన్‌తో ఏర్పడుతాయి. గోళ్లలో కనిపించే ప్రతి చిన్నమార్పు మన ఒంట్లో తలేత్తిన అనారోగ్యం తాలుకా సంకేతమే అంటారు వైద్యులు. గోళ్లులో కనిపించే రంగులు, మార్పులు, వాటి స్థితిగతులు ఇవన్ని మన శారీరక అనారోగ్యాన్ని పట్టిస్తాయి. రక్తహీనత, విటమిన్ల లోపాలు వంటి చిన్న చితక ఆరోగ్యసమస్యలను మెుదలుకుని …. హైబీపి, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి ఎన్నో రకాల సమస్యలను గోళ్లు మనకు తెలియజేస్తాయి. మనం ఏం తింటున్నాం..? మనలో ఏం లోపించింది..? అనే విషయాలను తెలియజేస్తాయి. అందుకే డాక్టర్లు కూడా అనారోగ్యాన్ని అంచనా వేసేందుకు గోళ్లను కూడా చాలా నిశతంగా పరిశీలిస్తారు.

ఆరోగ్య పరీక్షల్లో వైద్యులు గోర్లను పరీక్షిస్తారు. అవి మన ఆరోగ్యానికి వాకిళ్లుగా పనిచేస్తాయి. గోళ్లు పలుచగా వున్నా, లేదా గోళ్ల మీద తెల్లని మచ్చలు, గాట్లు ఉన్నా… శరీరంలో జింక్‌ లోపం వున్నట్లు అర్థం. మన గోళ్లకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. మన శరీరంలోని అవయువాలు అన్ని పెరగడం ఆగిపోయినా … మన గోళ్లు మాత్రం మనం చనిపోయేంతవరకు పెరుగుతూనే ఉంటాయి. మన గోళ్లను నిత్యం పరిశీలనగా చూసుకుంటూ వాటిలో కనిపంచే మార్పుల పట్ల అవగాహాన పెంచుకుంటే మన ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు. కోంత మందికి గోళ్లు కొద్దిగా పెరగగానే వాటి అంతట అవే విరిగిపోతాయి. అలా గోళ్లు విరిగిపోతుంటే మనలో క్యాల్షియం తక్కుగా ఉందని విటమిన్ డి లేదా జింక్ వంటి పోషకఆహార లోపం ఉందని గుర్తించాలి. కొందరికి గోళ్లు త్వరగా పెరగవు పైగా పాలిపోయినట్లు ఉంటాయి. రక్తహీనత , పోషకాహారలోపం ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు గుండే లేదా కాలేయానికి సంబందించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

గోళ్లపై ఏర్పడే తెల్లటి మచ్చలు నాడీ వ్యవస్థలో అసాధారణలకు సూచికలుగా పేర్కొంటారు. మన శరీరం అధికంగా ఒత్తిడికి గురవటం వల్ల కూడా ఈ తెల్లటి మచ్చలు ఏర్పడుతాయి. కొన్ని సార్లు తీవ్ర వ్యాధులకు గురయ్యామని తెలిపే సూచనగా కూడా ఈ మచ్చలు కలగవచ్చు. ఎక్కువ శాతం వరకు గోళ్లపై తెల్లటి మచ్చలు కలగటానికి గల కారణం కాల్షియం లోపం వలన అని చెప్పవచ్చు. జింక్ లోపం వలన చేతి గోళ్లపై మచ్చలు లేదా చారలు ఏర్పడతాయి. ఇలాంటి వారు కార్బోహైడ్రేట్లు, పాలకూర లాంటి ఆహార పదార్థాలను తినటం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ప్రోటీన్ లోపం కారణంగా చేతి గోళ్లపై సమాంతర చారాలు ఏర్పడుతాయి. ఈ లైన్లు గోళ్ల చివరల్లో కాకుండా గోరు ప్రారంభంలో ఉంటాయి. చేతిగోళ్లపై ఏర్పడే మచ్చలు హెపటైటీస్, సిర్రోసిస్, కిడ్నీ ఫెయిల్యూర్, అనీమియా వంటి ప్రమాదకర వ్యాధులకు సూచికలుగా వైద్యులు నిర్ధారిస్తారు. మీ గోళ్ళ ఆకారములో రంగులోను , తేడాలు కనిపిస్తే మంచి వైద్యుని సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి .

Leave a Comment