Pawan kalyan : పవన్ కళ్యాణ్ వైఫై చూస్తున్న ఏపి ప్రజలు … సీఎం కావాలని కొరుకుంటున్న అభిమానులు

By manavaradhi.com

Updated on:

Follow Us

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ సారైనా పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీలో చూడాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు… అంతే కాదు పవన్ సీఎం కావాలని వారు ఎదురుచూస్తున్నారు… అయితే పవన్ మాత్రం 40 మందికి పైగా జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పంపాలనే ఉద్దేశం పనిచేస్తున్నారు. ప్రస్తుతం అదే పవన్ కళ్యాణ్ టార్గెట్ గా కనిపిస్తుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీకి జనసేన ఎమ్మెల్యేలు అడుగు పెట్టడం పక్కగా కనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ కు సీఎం కుర్చీ మీద ఆశ లేదు రాజకీయాలకు వచ్చింది పదవుల కోసం కాదు… ప్రశ్నించడం కోసమే అయితే రాజ్యాధికారం మాకే కావాలంటున్న ఆయన అభిమానులకు ఇది కచ్చితంగా శుభవార్తె…! జనసేనుడి బలం బలగం యువత, మహిళలు, వృద్ధులు, తటస్తులు, ఓసి, బిసి,ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందినవారు అధికంగా ఉన్నారు. మరో పక్క జనసేన పార్టీ ఓటింగ్ శాతం నానాటికి పెరుగుతూ వెళ్తుంది. కచ్చితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యంకి వచ్చిన ఓటింగ్ శాతం 18 ఎప్పుడో దాటిపోయింది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం 25 శాతం ఉండొచ్చు అంటున్నారు.

చాలామంది పవన్‌ రాజకీయాలకు పనికిరాడు.. స్థిరత్వం ఉండదు.. అప్పుడప్పుడు నేనున్నానంటూ మెరుస్తుంటాడు అని రాజకీయ పార్టీలు ఆరోపిస్తుంటాయి. వీరి ఆరోపణల ప్రకారం పవన్‌కు ప్రజల్లో క్రేజ్‌ ఉండకూడదు. కాని పవన్‌కు ఉన్న ఆదరణ మరే నాయకునికి లేదనడానికి ఈ మధ్య పవన్‌ నిర్వహించిన వారాహి యాత్రలే. ఇందుకు కారణం అతని నిక్కచ్చితనం.. ముక్కుసూటి మాటలు.. పార్టీని నడపాలంటే నేను సినిమాలు చేస్తేనే డబ్బు వస్తుంది.. ఆ డబ్బుతోనే పార్టీని నడపాలి. అందుకే మధ్యలో గ్యాప్‌ రావడానికి కారణం అంటూ నిర్మొహమాటంగా చెప్పడం పవన్‌లో ప్రత్యేకత. అందుకే పవన్‌ అంటే ప్రజలకు అభిమానం.

ఈమధ్య మహిళా అభిమానుల సంఖ్య యువతను దాటేసింది. పవన్‌ సభలను చూస్తే మహిళలే ఎక్కువ. పవన్‌పై ఆరోపణలు చేయడానికి అవినీతి, అక్రమాలు లేవు.. మోసాలు పవన్‌ డైరీలోనే కనపడవు.. అందుకే పవన్‌ను మూడు పెళ్లిళు అంటూ పదేపదే విమర్శలు చేయడం చూశాం. ఈ మూడు పెళ్లిళ్ల ఆరోపణ తప్పా ఇంకేమి దొరకదా అంటూ ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదీఏమైనా తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాల సీఎంల్లా అభివృద్ధిలో దూసుకుపోయే లక్షణాలు పవన్‌కు ఉన్నాయంటున్నారు రాష్ట్ర ప్రజలు. అందుకే 2024లో జనసేన అసెంబ్లీలో అడుగుపెడుతుంది.. పొత్తులలో భాగంగా 50 సీట్లు వరకు అడిగే అవకాశాలు ఉండగా… 40 కి పైగా జనసేన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించరా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా కనిపిస్తుంది..

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే 2029 ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ పూర్తి మెజారిటీ సాధించి సీఎం అయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత అయిదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై స్పందిస్తూ.. ప్రజల పక్షాన నిలబడడమే పవన్‌ రాజకీయంగా ఎదుగుతాడు అన్నదానికి బలం చేకూరుస్తుంది వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆర్థిక నియంత్రణ లేదు. అక్రమాలు, దాడులు, కేసులు.. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీని ఎదుర్కోవాలంటే.. ఐక్యత తప్పదు. అందుకే టీడీపీతో చేతులు కలిపి 2024 ఎన్నికల్లో జనసేన పోటీకి సిద్ధమైంది.

Leave a Comment