Health Tips : యవ్వనంగా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి

By manavaradhi.com

Published on:

Follow Us
avoid these mistakes

చాలా మంది ముసలి తనం వచ్చేస్తుందని తెగభాదపడుతుంటారు. వయసు పెరుగుతూ ఉంటె ఎవరు మాత్రం సంతోషంగా ఉంటారు. ఎవరికైనా నిండు యవ్వనంగా ఉండిపోవాలని ఉంటుంది. అది సర్వసాధారణం. అసలు వయసు పెరగకుండా ఉండదు కానీ, దానికి శరీరం పెద్దగా స్పందించకుండా, నిత్యం యవ్వనంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

మన వయసు రోజురోజుకి పెరుగుతుంటే వృధాప్యం మీద పడుతూఉంటుంది. వయసుతో పాటు భౌతికంగా వచ్చే మార్పులను నియంత్రించడం కష్టమేమో గానీ, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుకోవడం వల్ల వృధాప్య ఛాయలు దరికిరాకుండా కాపాడుకోవచ్చు . ఇందుకు మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మరింత పెంచుకోవచ్చు. చిన్న పాటి జాగ్రత్తల ద్వారా మనసుకు వయసు పెరగకుండా చూసుకోవచ్చు.

మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాలి. రోజూ వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. శారీర వ్యాయామం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా చాలా అవసరం. రోజుకు కనీసం 30 నిముషాల వ్యాయామం మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎప్పుడూ పనే కాదు… విశ్రాంతి కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం అని గుర్తించడం చాలా అవసరం.

మంచి అలవాట్లు మనం హాయిగా జీవించటానికి ఎంతగానో తోడ్పడతాయన్నది తెలిసిందే. నిత్యం యవ్వనంగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు. అందుకోసం మన జీవనశైలిలో కొన్ని మార్పులు చుసుకోవాలి. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే డీ విట‌మిన్ పొందేందుకు ఉదయం కొంత సమయం శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. అలాగని ఎక్కువసేపు ఎండలో ఉండడం కూడా మంచిది కాదు దీనివల్ల చర్మం త్వరగా పాడైపోతుంది. రోజూ క్రమం తప్పకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. ఈ అలవాటు వల్ల బరువు తగ్గుతుంది. శరీరంలో ఉండే హానికర విషతుల్య పదార్థాలను బయటకు పంపేస్తుంది. డిహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది.

కంటి నిండా నిద్ర‌పోయేలా చూసుకోవాలి. మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవ‌స‌రం. కాబట్టి ప్రతిరోజు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత ముఖ్యం. యోగా, ధ్యానం చేయడం వ‌ల్ల ప్ర‌శాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

యవ్వనంగా ఉండేదుకు తీసుకోనే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని, ఎంత మేర తీసుకుంటన్నామని గుర్తు పెట్టుకుని మంచి డైట్ తీసుకోవాలి. దీని కోసం పండ్లు, కూరగాయాలు, ఆకు కూరలు, చేపలు అధికంగా తీసుకోవాలి. క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. వృద్ధాప్యఛాయలు దరిచేరకుండా ఉంటాయి. రోజు కనీసం 45 నిమిషాలు వ్యాయామం చే యడం అలవాటు చేసుకోండి.

పొగ తాగడం, అధికంగా మద్యం సేవించడం లాంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పొగాకులో ఉండే నికోటిన్‌ అనే పదార్థం చర్మానికి సరఫరా అవుతున్న రక్తాన్ని అడ్డుకుంటుంది. ఫలితంగా చర్మం డల్‌గా మారుతుంది. జీవం కోల్పోయినట్లుగా మారుతుంది. కాబట్టి స్మోకింగ్‌ వదిలేయండి. డిప్రెషన్ లో ఉండడం కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసి, తద్వారా శారీరక ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. అందుకే మంచి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి. చెడు అలవాట్లు మానుకుని, మంచి ఆహారాన్ని తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా విశ్రాంతి తీసుకోవడం వలన యవ్వనంగా ఉండవచ్చు.

రోజూ వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. శారీర వ్యాయామం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా చాలా అవసరం. రోజుకు కనీసం 30 నిముషాల వ్యాయామం మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వయసుపై బడుతున్న ఛాయలు మీ దరిచేరకుండా చూసుకోవచ్చు.

Leave a Comment