Eye drops : ఈ చుక్కల మందుతో కళ్ల జోడు అవసరమే లేదు

By manavaradhi.com

Published on:

Follow Us
Eye drops

నేటి ఆధునిక సమాజంలో ల్యాప్‌టాప్స్ మీద గంటల తరబడి వర్క్ చేయడం, మొబైల్ ఫోన్స్ స్క్రీన్స్ చూస్తూ ఉండడం, ఇంకా టైమ్ ఉంటే టీవీ చూడడం, ప్రస్తుతం ఇదే మన జీవిత విధానం. కొంచెం కష్టం గా ఉన్నా అంగీకరించక తప్పని వాస్తవం ఏమిటంటే ఒక స్క్రీన్ కాకపోతే… ఒక స్క్రీన్ వైపు మనం రోజంతా చూస్తూనే ఉంటున్నాం. బ్రెయిన్ కంటే కూడా ఐస్ కి వర్క్ ఎక్కువైపోయింది. దీంతో రోజురోజుకి ఐ ప్రాబ్లమ్‌స్ ఎక్కువైపోతున్నాయి.

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. శరీరంలో ఉన్న భాగాల్లో కళ్లు అత్యంత ప్రధానమైనవి, వీటిని సురక్షితంగా కాపాడుకోవాలి. వయసుతో పాటు వచ్చే కంటి సమస్యలు చాలానే ఉన్నాయి. అక్షరాలను సరిగా చదవలేరు , దగ్గరగా ఉండేవి చూడలేరు. 40 ఏళ్ళ తర్వాత ఇలాంటి సమస్యలు ఎదురౌతాయి. ఈ సమస్యకు రీడింగ్ గ్లాస్ లాంటి వాటితో పరిష్కారం పొందవచ్చు.

ప్రస్తుత తరుణంలో ఈ సమస్యకు మనకు కొన్ని రకాలు ఐ డ్రాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా మన కంటి పవర్ పెరిగిపోకుండా చూసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. వయసు పైబడుతున్నకొద్దీ చూపు మందగించి, అంధత్వానికి దారితీసే వ్యాధులకు విప్లవాత్మకమైన ఐ డ్రాప్స్‌ను శాస్త్రవేత్తలు తయారుచేశారు.

వయస్సు-సంబంధిత అస్పష్టమైన దృష్టిని కలిగి చాలా మందికి ఐడ్రాప్ .. రీడింగ్ గ్లాసులను భర్తీ చేయగలదు. ఈ ఐ డ్రాప్స్ దాదాపు 15 నిమిషాల్లో పని చేయడం ప్రారంభిస్తుంది మరియు 6 నుండి 10 గంటల వరకు చక్కని దృష్టిని అందిస్తుంది. 40 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను ప్రభావితం చేసే ప్రిస్బియోపియా కు చికిత్స చేయడానికి FDA- ఆమోదించబడిన ఐడ్రాప్. ఈ ఐ డ్రాప్స్ కంటి పరిమాణాన్ని తగ్గించడానికి కంటి యొక్క సహజ సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది.

చుక్కలను ఉపయోగించే వ్యక్తులకు, మొదట వస్తువుల మధ్య వారి దృష్టిని సర్దుబాటు చేయడం కష్టంగా ఉండవచ్చు. కానీ నెమ్మదిగా చక్కగా కనిపిస్తుంది. ఈ ఐ డ్రాప్స్ 40-55 సంవత్సరాల వయస్సు వారికి ఉత్తమంగా పని చేస్తాయి మరియు 65 సంవత్సరాల తర్వాత తక్కువ ప్రభావవంతంగా ఉంటాయి.

ఈ ఆధునిక యుగంలో కంటికి శ్రమ మరింతగా పెరిగింది. టెక్నాలజీ పెరిగిపోయిన కొద్దీ కళ్లని మనం మరింత శ్రమకి గురిచేస్తున్నాం. వీటన్నింటినీ తట్టుకుంటూ, వయసు పెరుగుతున్నా మన కళ్ల ఆరోగ్యంగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఐ డ్రాప్స్ వాడేవారు.. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా తక్కువ కాంతి ఉన్న చోట పనిచేస్తున్నప్పుడు ఉపయోగించకూడదు.

మయోపియా మరియు హైపోరోపియా వంటి ఇతర కంటి పరిస్థితులు ఉన్నవారికి కూడా చుక్కలు అంతగా ప్రభావాన్ని చూపించవు. చాలా మంది ఇష్టాను సారం ఐ డ్రాప్స్ వాడుతుంటారు. అది మంచి పద్దతికాదు. తగిన వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరకు ఐడ్రాప్స్ వాడడం మంచిది. అలాగే చలువ కళ్ళద్దాలు వాడడం, కంటికి ఎక్కువగా ఎండ తగలనివ్వక పోవడం, కళ్ళలో దుమ్ము లాంటివి పడకుండా చూసుకోవడం, రోజూ చల్లని నీటితో కంటిని శుభ్రపరచుకోవడం లాంటివి చేస్తుండాలి.

కంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, పొడి బారిన కళ్ళు, గాయాలు, కంటి శస్త్రచికిత్సలు, కండ్లకలక వంటి వివిధ రకాల కంటి పరిస్థితులకు చికిత్సలో భాగంగా, కంటి చుక్కల మందును వైద్యులు సూచిస్తుంటారు. అయితే, కొన్ని రకాల కంటి చుక్కలు కంటికి సరిపోని కారణంగా ప్రతికూల పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి వైద్యుల సలహమేరకు మాత్రమేఐడ్రాప్స్ వాడడం మంచిది.

Leave a Comment